‘KCR U-turn on GO 111’: Waterman Rajendra Singh దశాబ్దాలుగా ప్రజా దహార్తిని తీర్చిన ‘తలాబ్’పై వాటర్ మాన్

Waterman rajendra singh urges kcr to not repeal go 111

GO 111, Himayath Sagar, HMWSSB, KCR, Osman Sagar, Rajendra Singh, Waterman of India, expert committee reports, tailor-made to suit the purpose of Government, protect water bodies, National Convention on Rivers, Telangana government, protect lakes, removing shield, Telangana

Rajendra Singh, popularly known as the Waterman of India wrote to Telangana CM K Chandrasekhar Rao and requested him to refrain from repealing the GO 111 that is meant to prohibit constructions such as residential complexes and other public spaces within the 10 kilometer radius of the twin reservoirs.

జీవో 111పై కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: ‘వాటర్ మాన్’ రాజేంద్రసింగ్

Posted: 03/16/2022 04:53 PM IST
Waterman rajendra singh urges kcr to not repeal go 111

హైదరాబాద్ నగరవాసులకు కొన్ని దశాబ్దాలుగా దహార్తిని తీర్చుతున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం కావడంపై విస్మయం వ్యక్తం చేశారు వాటర్ మాన్ ఆప్ ఇండియా రాజేంద్ర సింగ్. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని, సుప్రీంకోర్టు సహా ఎన్జీటీ లాంటి పలు న్యాయస్థానాలు గతంలో వెలువరించిన తీర్పులను ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చెందిన జలశయాలను పరిరక్షిస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిన నెల రోజుల లోపే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. జీవో ఉపసంహరణపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

చెరువులను పరిరక్షిస్తామంటూ గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన 'జాతీయ నదుల పరిరక్షణ' సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించి నెల రోజులు కూడా తిరగకముందే సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయన్నారు. నిపుణుల కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వమే అయినందున వారు ఇచ్చే నివేదిక పాలకులకు అనుకూలంగానే ఉంటుందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం, రియల్టర్లకు లబ్దికోసమే ఈ జీవోను ఎత్తివేయాలని అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిపుణుల కమిటీ నివేదిక ఇందుకు భిన్నంగా ఉంటుందనే భావన కలగడంలేదని, 1996లో వెలువడిన ఈ జీవో ద్వారా ఏడు మండలాల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని సుమారు 1.32 లక్షల ఎకరాల భూమికి రక్షణ కల్పించిందని, ఇప్పుడు ఎత్తివేయడం ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి జలాశయాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. గోదావరి నుంచి మల్లన్నసాగర్ మీదుగా వచ్చే నీటితో హైదరాబాద్ నగరానికి వందేళ్ళ వరకు తాగునీటి సమస్య ఉండదని పేర్కొంటూ జీవో 111ను ఎత్తివేయడం గురించి సీఎం మాట్లాడడం సహజ వనరుల పరిరక్షణకు ప్రమాదాన్ని కొని తెస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడమంటే సుప్రీంకోర్టు 2001లో వెలువరించిన తీర్పుతో పాటు మరికొన్ని తీర్పులను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48-ఏ ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి చెరువులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ జీవోను ఎత్తివేయడం ద్వారా ఏకకాలంలో రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా చెరువులను పరిరక్షించాలనే ఉద్దేశమే ఉన్నట్లయితే 84 గ్రామాల ప్రజలను మరో చోటికి తరలించవచ్చన్నారు.

ఈ తరహా చర్యలతో యావత్ దేశానికి రోల్ మోడల్‌గా కేసీఆర్ నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఈ రెండు చెరువులను, సహజ వనరులను కాపాడుకునేలా ఆదర్శంగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే అనివార్యంగా తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని, ఆ పరిస్థితులను ఆయనే కల్పించారనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ కాకతీయ లాంటి పథకాలను రాజేంద్రసింగ్ గతంలో పూర్తిస్థాయిలో కీర్తించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles