Telangana To Conduct TET Exam Soon మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలొ టెట్ నోటిఫికేషన్

Telangana to conduct teacher eligibility test soon says education minister

TET exam, Teacher eligibility Test, Sabitha Indra Reddy, Education Minister, Telangana jobs, Recruitment teacher jobs, District Selection Committee, DSC, Telangana State Public Service Commission, TSPSC, Telangana, Politics

The Telangana government seems to be on a recruitment overdrive. Days after announcing the first recruitment drive, the state government is in the process of conducting a Teacher Eligibility Test (TET). Education minister Sabitha Indra Reddy said the Chief Minister has directed the concerned department to conduct the Teacher Eligibility Test (TET) exam soon.

మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలో టెట్ నోటిఫికేషన్: మంత్రి సబిత

Posted: 03/15/2022 12:11 PM IST
Telangana to conduct teacher eligibility test soon says education minister

తెలంగాణలో ఉపాధ్యయ అర్హత పరీక్ష (టీచర్ ఎలజిబిలిటీ టెస్ట్) టెట్ ను నిర్వహించేందుకు మరో రెండు మూడు రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత వారం నిరుద్యోగ యువత ఆశలను సంపూర్ణం చేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో రాష్ట్రంలో ఏకంగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వివిధ శాఖలలో భర్తి చేయనున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా ఇందులో భాగంగా విద్యాశాఖలోని సుమారు 11 నుంచి 12వేల పోస్టుల భర్తీ కూడా జరగనుంది.

అయితే ఈ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక కావాల్సిన ఔత్సాహికల కోసం టీచర్ ఎలజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలో టెట్ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ పరీక్షను ఎప్పటిలానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఉపాధ్యాయుల నియామకాలు డీఎస్సీ ద్వారా జరగనున్నాయా? లేక టీఎస్పీఎస్సీ చేపడుతుందా అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు కానున్నందున.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles