HC upholds hijab ban in educational institutions హిజబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు.!

Karnataka high court rules wearing hijab not essential religious practice

hijab row verdict, religious wear to school, hijab not essential to Islam, Karnataka high court verdict on hijab row, hijab row Karnataka high court verdict, Hijab Row, Karnataka High Court, Verdict of Karnataka High court on Hijab row, BJP, religious practice, Islam, education institutions, Karnataka, Crime

Karnataka High Court on Tuesday dismissed various petitions challenging a ban on Hijab in education institutions. The Karnataka High Court said that wearing Hijab is not an essential religious practice of Islam. The Karnataka High Court also said that no case is made out for invalidating the Government Order of February 5.

కర్ణాటక హిజబ్ వివాదంపై హైకోర్టు దర్మాసనం సంచలన తీర్పు.!

Posted: 03/15/2022 01:34 PM IST
Karnataka high court rules wearing hijab not essential religious practice

హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లువరించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. హిజబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ల అన్నింటినీ కొట్టివేసింది. విద్యార్థులందరూ ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు నేపధ్యంలో దక్షిణ కన్నడ జిల్లాలో విద్యాసంస్థలను మూసివేశారు. పలు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాడు చేశారు.

కర్ణాటక కాలాబురాగి జిల్లా నుంచి పలు జిల్లాలకు పాకి ఆపైన.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పాకిన హిజాబ్ వ్యవహారం.. ఏకంగా ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్​ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది కర్నాటక హైకర్టు ధర్మాససం. జస్టిస్​ రీతు రాజ్​ అవస్థి, జస్టిస్​ కృష్ణ దీక్షిత్​, జస్టిస్​ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరిస్తూ.. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది.

ఇక హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హిజాబ్‌ వివాదం మొదలైన.. ఉడుపిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కలబురగి జిల్లా యంత్రాంగంతో పాటు పలు ఉత్తరాది జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్​ను అమల్లోకి తెచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజీలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 15-21 మధ్య బెంగళూరులోని బహిరంగ ప్రదేశాల్లో.. గుమిగూడటం, నిరసనలు, వేడుకలు చేయడానికి వీల్లేదని కమిషనర్​ కమల్​ పంత్​ వెల్లడించారు. బెంగళూరులోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రీతు రాజ్​ అవస్థి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం తీవ్రంగా రాజుకుని సమస్య కోర్టు వరకు వెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles