BJP to protest Speaker’s decision to ban 3 MLAs సుప్రీంకు వెళ్తాం.. స్పీకర్‌ను కలిసినా నిరాశే: బీజేపి ఎమ్మెల్యేలు

Telangana bjp to protest speaker s decision to ban 3 mlas

BJP protest, BJP MLAs, Telangana Assembly, High Court, Assembly Speaker, Pochram Srinivas reddy, Assembly Secretary, Raja Singh, Raghunandhan Rao, Etela Rajender, Hyderabad, Hyderabad news, Protest, Telangana, Telangana assembly, Telangana news, Telangana politics

The Bharatiya Janata Party(BJP) Telangana unit has called for a protest on March 17 over the Assembly Speaker’s decision to ban three MLAs during the ongoing session. The protest titled “Save Constitution from Autocracy,” is going to be held at Dharna Chowk, Indira Park between 11:00 AM to 5:00 PM. Former BJP MLAs, MPs, MLCs, ZPTCs, MPPs, Corporators and leaders along with workers of all morchas of the party will participate in the protest.

స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా 17న బీజేపి ఆందోళన కార్యక్రమం

Posted: 03/15/2022 11:26 AM IST
Telangana bjp to protest speaker s decision to ban 3 mlas

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో శాసనసభకు చేరుకున్న సస్పెండెడ్‌ బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతిని ఇవ్వలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పీకర్‌ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు గేటు వద్ద కొద్ది సేపు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్‌ తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ఇదిలావుండగా, తమను సస్పెండ్ విషయంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల పూర్తి కాఫీ అందిన తరువాత తాము స్పీకర్ నిర్ణయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని సస్పెన్షన్ కు గురైన బీజేపి ఎమ్మెల్యేలు తెలిపారు. ఇక మరోవైపు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో దానిని బలంగా జనంలోకి తీసుకువెళ్లి.. వారి అండ పొందేందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ మార్చి 17 న ఆందోళనకు పిలుపునిచ్చింది.  

"ఏకచక్రాధిపత్యం నుండి రాజ్యాంగాన్ని కాపాడాలి’’ అనే నినాదంతో నిరసన వ్యక్తం చేయబడుతుంది. మాజీ బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పోరేటర్లు, బీజేపి జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు అన్ని అనుబంధ సంస్థలు, యువమోర్చా, మహిళా మోర్చలతో పాటు బిఎంఎస్ సహా అనుబంధ కార్మిక సంఘాల సభ్యులు, కార్మికులతో పాటు నిరసనలో పాల్గొంటారని బీజేపి ఇప్పటికే తెలిపింది. కాగా శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్‌ చేయడం వారి హక్కులను హరించడమేనని హైకోర్టు సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles