BJP surges ahead in Uttarakhand, UP; leads in Goa ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలోనూ బీజేపి హవా

Bjp surges ahead in uttarakhand up leads in goa

election results, election results 2022, election results live, election results live updates, punjab election result, up election results, uttarakhand election results, goa election results, manipur election results, uttarakhand election result, election results, manipur election result, manipur election results, Manipur election results 2022, manipur assembly election results, manipur assembly election results 2022, manipur assembly election results, goa election result, goa election results, goa election results 2022, goa assembly election results, goa assembly election results 2022, goa assembly election results, uttarakhand election results 2022, uttarakhand assembly election results, uttarakhand assembly election results 2022, uttarakhand assembly election results

In Uttarakhand and Manipur all the surveys predicted a tight contest between the BJP and it's arch rival Congress. However, the BJP has taken a big lead and is likely to retain power. In Manipur, the Congress is set to lose with BJP-led alliance taking a comfortable lead. While in Goa Pollsters predicted a hung assembly in the state. However, BJP has taken a massive lead in the state

ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలోనూ కొనసాగుతున్న బీజేపి హవా

Posted: 03/10/2022 01:02 PM IST
Bjp surges ahead in uttarakhand up leads in goa

గోవాలో బీజేపీ అధికారం దిశగా ప్రయాణిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో, ఆప్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నాయి. తృణముల్ కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో వుంది. సాన్ క్యూలిమ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ సంగ్లానీ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమోద్ సావంత్ పై ముందంజలో కోనసాగుతున్నారు. ఇక కర్టోరిమ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచి అలీక్సో రెజినాల్డో లౌరెన్కో ముందంజలో ఉన్నాడు. ఈయన తృణముల్ కాంగ్రెస్ లో చేరేందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఎంసీకి కూడా కాదని స్వతంత్రంగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

గోవా రాజధాని పానాజీ నుంచి బీజేపి అభ్యర్థి అటానాసియా మోన్సెరేట్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఓటమిని చవిచూశాడు. గోవాలోని తన తండ్రి అసెంబ్లీ స్థానం నుంచి తాను స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని, అయితే తనకు మద్దుతుగా నిలిచిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీల అభ్యర్థులకు గట్టిపోటిని ఇచ్చానని అన్నారు. అయితే ఫలితం తనకు అనుకూలంగా రాకపోవడమే బాధాకరమని ఉత్పల్ పారికర్ అన్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు గాను బీజేపీ 34 చోట్ల, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యం చూపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర అవిర్భావం జరిగిన 21 ఏళ్లలో ఎన్నడూ ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం రెండో పర్యాయం అధికారాన్ని అందిపుచ్చుకోలేదు. కానీ ఈ ధపా ఫలితాల సరళిని విశ్లేషిస్తే.. ఈ సారి బీజేపి రెండో పర్యాయం అధికార పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించనుంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని కీలకమైన నేతలు కూడా వెనుకంజలో వున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ తన ప్రత్యర్థి మోహన్ సింగ్ బిష్ట్  చేతిలో 7000 ఓట్లకు పైగా వెనుకంజలో వున్నారు.

మరోవైపు బీజేపికి చెందిన ప్రముఖ నేత సుబోధ్ ఉన్నియాల్ తన లల్ ఖౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ రావత్ కన్నా 1544 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక అదే సమయంలో ఎన్నికల ముందు బీజేపి నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన సీనియర్ నేత యశ్ పాల్ ఆర్య కూడా తన బాజ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3000 ఓట్లతో వెనకంజలో కోనసాగుతున్నారు. అదే సమయంలో బీజేపికి చెందిన కీలక నేత రామ్ శరణ్ నౌటియాల్ కూడా 1802 ఓట్లతో కాంగ్రెస్ కు చెందిన ప్రీతమ్ సింగ్ కన్నా వెనకంజలో కొనసాగుతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల గెలుపు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఎన్ పీపీ 13 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles