Rajasthan Minister SK Dhariwal Apologizes వెనక్కు తగ్గిన మంత్రి.. ‘‘మాది మొగాళ్ల రాష్ట్రం’’ వ్యాఖ్యలపై క్షమాపణలు

It was slip of tongue i apologise r than minister after remarks on women draw wide criticism

Shanti Dhariwal slip of tongue, Rajasthan minister slip of tongue, Rajasthan minister Shanti Dhariwal slip of tongue, Shanti Dhariwal, Rajasthan minister, Rajasthan minister Shanti Dhariwal, minister on Rajasthan No.1 in rape cases, minister Shanti Dhariwal on rapes, BJP, Rajasthan Minister, SK Dhariwal, Shanti Kumar Dhariwal, rajasthan minister apologizes, slip of tongue, parlimentary affairs, Rajasthan, Politics

Amid an uproar by the Opposition MLAs over his remarks in the House, Parliamentary Affairs Minister Shanti Dhariwal on Thursday tendered an apology saying it was a slip of tongue. “It was a slip of tongue. I feel sorry for that. I wanted to say something for the desert state. I personally respect women and will continue to do so. If my comments have hurt anyone, I apologise," Dhariwal said.

వెనక్కు తగ్గిన మంత్రి.. ‘‘మాది మొగాళ్ల రాష్ట్రం’’ వ్యాఖ్యలపై క్షమాపణలు

Posted: 03/10/2022 01:13 PM IST
It was slip of tongue i apologise r than minister after remarks on women draw wide criticism

రాజస్తాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని అధికార బీజేపి నేతల దాడుల్లో దళితల మహిళలు సమిధలు అవుతున్నారని అందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అలాంటి నేరాలపై తమ పార్టీకి చెందిన రాజస్థాన్ మంత్రి దారుణ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. ఇటీవల దేశంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచిన విషయమై అసెంబ్లీలో చర్చ సాగగా.. దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్.

ఈ మేరకు ఆయంన అసెంబ్లీలో మాట్లాడుతూ..."రేప్‌ కేసుల్లో మనమే  నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే రాజస్తాన్‌ పురుషుల రాష్ట్రం." అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ సతీష్‌ పూనియా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ రేఖా శర్మ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు శాంతి ధరివాల్ మహిళలను అవమానించడమే కాక పురుషుల గౌరవాన్ని దిగజార్చారని సతీష్ పూనియా ఆరోపించారు. ఈమేరకు షెహజాద్ ఆ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్ లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తుండడంతో ఎట్టకేలకు రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్ ఎట్టకేలకు వెనక్కుతగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నిరసనల మధ్య ఆయన తాను చేసిన వ్యాఖ్యలకు నిండుసభలో క్షమాపణలు కోరారు. తాను నోటి నుంచి అనవసరంగా మాట జారారని మన్నించమని కోరారు. ‘‘నా నోరు జారి.. నేను చేసిన వ్యాఖ్యలకు మన్నించమని కోరుతున్నారు. నేను నిత్యం మహిళలను ఎంతగానో గౌరవిస్తాను. కానీ నిన్న నేను ఏదో చెబుదామనుకొని.. ఏదో చెప్పి మహిళలు గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించానని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే వారికి తాను క్షమాపణలు చెబుతున్నాను’’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles