Maoist warns YSRCP Paderu MLA over Bauxite mining issue వైసీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీకి మావోలే హెచ్చరికలు..

Oppose bauxite mining or face same fate as araku mlas ysrcp mla gets death threat

Maoist warns YSRCP MLA, Maoists threatening letter to MLA, YSRCP Paderu MLA Bhagya Lakshmi, Waring Letter to YCP MLA, Bauxite miningin Vishaka Agency Area, Visakhapatnam, Andhra Pradesh, Politics, Crime

The Communist Party of India (Maoist), the banned outfit has now threatened yet another sitting legislator, Bhagya Lakshmi from Paderu constituency for her stance on bauxite mining in the region. The Maoist leave a threatening letter In which they have warned her to leave the Agency area.

‘‘మాన్యం వదిలి వెళ్లు..’’: వైసీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీకి మావోల హెచ్చరికలు..

Posted: 03/08/2022 01:10 PM IST
Oppose bauxite mining or face same fate as araku mlas ysrcp mla gets death threat

మహిళా దినోత్సవం రోజును మావోయిస్టులు మహిళా ఎమ్మెల్యేకు అల్టిమేటం జారీ చేశారు. అమెను తక్షణం తన పదవులతో పాటు ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మన్యం వీడి వెళ్లాలని అదేశించారు. లేదంటే గతంలో మన్యం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు.? అంటే అమె అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. అమెకు హెచ్చరికలు జారీ చేస్తూ మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని హెచ్చరించారు.

తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన పక్షంలో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని,ప్రజాకోర్టులో ప్రజలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు. చాపరాతి పాలెంలో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేకు భద్రతను పెంచే ఆలోచనలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles