Reddy Labs Inter Based Jobs 2022-23 Jobs డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్: అటు విద్యాభ్యాసం.. ఇటు ఆర్జనం..

Dr reddy labs inter based jobs 2022 23 job vacancy in telangana

Dr Reddy Labs catch them young, Dr Reddy Labs intermiediate students, Dr Reddy Labs chemical studies, Dr Reddy Labs jobs with inter, Dr Reddy Labs provides degrees study, Dr Reddy Labs meritorious students, Dr Reddy Labs job mela sangareddy, Intermiediate student, jobs with inter, Dr Reddy Labs, Job mela, meritorious students, training, Chemical study, Sangareddy, Telangana

Dr Reddy Labs is making the dreams of the outstanding meritorious students of Telangana to come true by making them employed in their company and by providing them relavent training and also making them study in the feild of chemistry. For which the company has conducted a Job mela in Sangareddy.

ఇంటర్ విద్యార్థులకు రెడ్డీస్ ల్యాబ్స్ ఉద్యోగం: అటు విద్యాభ్యాసం.. ఇటు ఆర్జనం..

Posted: 03/04/2022 01:34 PM IST
Dr reddy labs inter based jobs 2022 23 job vacancy in telangana

స్వర్గీయ అంజిరెడ్డి స్థాపించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలంగాణలో చదువుకోవాలని ఆసక్తి వున్న విద్యార్థులకు ఉపాధితో అండగా నిలుస్తూనే.. వారిని ఉన్నత విద్యను అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఈ సారి సంగారెడ్డి జిల్లాలో చేపట్టనుంది. చదువులో ఉత్సాహం, ఆసక్తి కనబర్చిన ఇంటర్ విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశం అందిస్తోన్న సంస్థ.. అదే సమయంలో వారిని ఉన్నత విద్యను (ఫార్మక్యూటికల్ కెమిస్ట్రీ)లో డిగ్రీ చదివించి.. పట్టాను అందుకోవడంలోనూ దోహదపడుతోంది.

ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.వి. జూనియర్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేరకు సంగారెడ్డి ఎస్ వి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పి.రామకృష్ణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాలకు 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తెలుగు భాషపై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గోనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

18 - 20 మధ్య వయస్సు గల విద్యార్థులను రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకొని డా. రెడ్డీస్ లాబొరేటరీస్ వారు బిట్స్ పిలాని హైదరాబాద్‌లో డిగ్రీ చదివిస్తూ (ఫార్మక్యూటికల్ కెమిస్ట్రీ), ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని, తగిన వేతనం కూడ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలతో పాటు ఆధార్ కార్డు పత్రాలతో, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9849477450, 9290434597, 8096454622, 9440362346 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles