Indian restaurant in Kyiv turns into bunker కీవ్ లో అపన్నులకు అసరగా నిలుస్తున్న భారతీయ హోటల్..

People are seeking shelter in a basement restaurant in kyiv the owner feeds them all

manish dave, Saathiya Restaurant, Kyiv, Ukraine, Indian restaurant, indian food, basement eatery, children, pregnant women, students, homeless people, older locals, Indian students, Vadodara, Gujarat

As Russia's attack on Ukraine was mounting, Kyiv residents were strongly urged to take shelter. Manish Dave – who owns an Indian restaurant in the country's embattled capital – swiftly opened his doors. For the past several days, Dave's basement eatery has doubled as a makeshift bunker, where dozens of children, pregnant women, students, homeless people and older locals have congregated, seeking safety from the deadly clashes. Since Russia waged war last Thursday, Dave has housed and fed more than 130 people.

కీవ్ లో అపన్నులకు అసరగా నిలుస్తున్న భారతీయ హోటల్..

Posted: 03/04/2022 03:35 PM IST
People are seeking shelter in a basement restaurant in kyiv the owner feeds them all

ప్రపంచదేశాల్లో అధిపత్యం చాటుకునే అగ్రదేశాల్లో ఒక్కటైన రష్యా.. తన పోరుగున్న ఉక్రెయిన్ దేశంపై యుద్దానికి పూనుకుని భీకర పోరుకు పాల్పడుతున్న నేపథ్యంలో మీడియా సహా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉక్రెయిన్ లో భీతావాహ పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. తమ దేశంలో అలుముకున్న యుధ్దమేఘాలు ఎప్పటికి తరలివెళ్తాయో తెలియక.. రష్యా కురిపిస్తున్న బాంబుల దాడులు, తుపాకుల మోతల మధ్య తాము ఉండలేమని ఉక్రెయిన్ పౌరులు లక్షలాదిగా పొరుగుదేశాలకు శరణార్థులుగా తరలిపోతున్నారు.

రష్యన్ దళాలు నానాటికీ ఉక్రెయిన్ దేశ భూభాగాలను ఆక్రమిస్తుండడంతో ఆదేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ దేశం కోసం ప్రాణాలను సైతం పనంగా పెట్టి తుపాకులు పట్టినవారు కూడా లేకపోలేరు. ప్రాణం కన్నా దేశానికే ప్రాధాన్యత ఇస్తున్నవారి సంఖ్యల కూడా ఉక్రెయిన్ లో తక్కువగా లేదు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేందుకు అక్కడి ప్రజలు ముందుకోచ్చి సైన్యంతో కలసి పోరాడుతున్నారు. ఇక, విద్యాభ్యాసం, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఉక్రెయిన్ వచ్చిన విదేశీయుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వదేశం వెళ్లే మార్గం లేక, ఉక్రెయిన్ లో తిండి దొరక్క అలమటించిపోతున్నారు. బంకర్లలో ఆశ్రయం దొరికినా ఆహారం లభించని పరిస్థితి ఉంది.

ఇలాంటి వేళ... ఓ భారతీయుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆపన్నహస్తం అందిస్తున్నాడు. అతడి పేరు మనీష్ దవే. గుజరాత్ కు చెందిన మనీష్ కీవ్ లోని ఓ జంక్షన్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ పేరు సాథియా. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర షురూ చేయడంతో అనేకమంది భారతీయ విద్యార్థులకు సాథియా రెస్టారెంట్ లో  ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉండడానికి చోటు మాత్రమే కాదు, వేడి వేడి ఆహారం అందిస్తూ కష్టకాలంలో మానవత్వం చాటుకుంటున్నారు. ఎవరికి ఆశ్రయం కావాలన్నా తమ రెస్టారెంట్ ద్వారాలు తెరిచే ఉంటాయని మనీష్ దవే సోషల్ మీడియాలో ప్రకటించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం.

ఇప్పటిదాకా 100 మందికి పైగా తాము ఆశ్రయం ఇచ్చామని, తమ శక్తిమేర సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ గుజరాతీ వ్యాపారి వెల్లడించారు. కాగా, తమవద్ద ఉన్న సరుకులు మరో మూడ్నాలుగు రోజులు వస్తాయని, ఆ తర్వాత కర్ఫ్యూ ఎత్తివేస్తే దుకాణాలకు వెళ్లి మరిన్ని సరుకులు తెచ్చి తమ వద్ద ఆశ్రయం ఉన్న వారికి ఆహారం అందిస్తామని తెలిపారు. కాగా, సాథియా రెస్టారెంట్ పేరు, మనీష్ దవే పేరు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. కల్లోల పరిస్థితుల్లో ప్రజలకు ఆశ్రయం కల్పిస్తూ మంచితనానికి మారుపేరులా నిలుస్తున్నారంటూ దవే గురించి అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. ముఖ్యంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత డబ్బుతో వంద మందికి పైగా ఆశ్రయం, ఆహారం అందించడం మామూలు విషయం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles