Y.S. Avinash Reddy refuses to take CBI notices సీబిఐ తాఖీదులు తీసుకోని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి

Ys viveka murder case y s avinash reddy refuses to take cbi notices

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YS Avinash Reddy, YS Bhaskar Reddy, Balineni Srinivasa Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Sources said some top officials of the CBI came to Kadapa a couple of days ago and tried to serve notice on Avinash for questioning in the Viveka murder case. However, the MP is understood to have refused to take any notices from the central agency.

వైఎస్ వివేకా కేసు: సీబిఐ తాఖీదులు తీసుకోని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి

Posted: 03/04/2022 12:33 PM IST
Ys viveka murder case y s avinash reddy refuses to take cbi notices

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసు విచారణలో భాగంగా వైఎస్ ప్రతాపరెడ్డి సీబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రాజేస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబిఐ కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దర్యాప్తు సంస్థ విచారణను వేగం పెంచడంతో కేసులు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 207 మందిని విచారించిన సీబీఐ అధికారులు... 146 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. మరోవైపు పలువురు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

కాగా, కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని సీబిఐ విచారణలో పలువురు వాంగ్మూలాలు ఇచ్చిన తరుణంలో సీబిఐ వారిని విచారించేందుకు పూనుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు నిన్న పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం.

దీంతో, కడప జిల్లా కోర్టును వారు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈరోజు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును న్యాయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ హత్యతో అవినాశ్ కు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అవినాశ్ ను విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తప్పుదోవ పడుతోందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని అన్నారని... జీవితంలో చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడని ఆరోజే తాము అనుకున్నామని బాలినేని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అమరావతికి సంబంధించి నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేని పనులను... మూడు నెలల్లో తమ ప్రభుత్వం ఎలా చేయగలదని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles