‘‘Putin alone can give assurance for safety of Indians’’ భారత్‌ విద్యార్థుల పట్ల సైనికుల దాష్టీకంపై ఉక్రెయిన్‌ రాయబారి

Only putin can assure safety of students ukraine envoy igor polikha

ukraine, indian students, igor polikha, Indian nationals, ukraine envoy, safety of indians, Russian President Vladimir Putin, assurance, mistreatment, discrimination

Ukraine is doing everything possible in challenging circumstances to facilitate the exit of Indian nationals, especially students, though Russian President Vladimir Putin alone can give assurances for their safety, Ukrainian ambassador Igor Polikha said. Brushing aside reports of mistreatment and discrimination against Indians trying to flee the war-torn country, Polikha emphasised the need for discipline and calm at border check points to ensure the orderly exit of all foreigners.

భారత్‌ విద్యార్థుల పట్ల సైనికుల దాష్టీకంపై ఉక్రెయిన్‌ రాయబారి

Posted: 02/28/2022 09:00 PM IST
Only putin can assure safety of students ukraine envoy igor polikha

భారతీయ విద్యార్థుల పట్ల ఉక్రెయిన్‌ సైనికుల దాష్టీకంపై ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా స్పందించారు. దీని గురించి భారతీయ అధికారుల వద్ద ఉన్న సమాచారమే తన వద్ద ఉందన్నారు. కాగా, విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి తరలించడం భారత్‌ ప్రాధాన్యత అని తెలిపారు. అయితే యుద్ధాన్ని ఆపడం, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ మేరకు భారత్‌ విద్యార్థులపట్ల ఉక్రెయిన్‌ సైనికుల దాష్టీకాన్ని ఆయన సమర్థించారు. అయితే విద్యార్థుల తరలింపు కోసం భారతీయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని ఉక్రెయిన్‌ రాయబారి వ్యాఖ్యానించారు.

మరోవైపు భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్‌ సైనికులు సరిహద్దుల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రష్యా దాడిపట్ల భారత్‌ తటస్థంగా ఉండటం, ఐకరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వనందుకు భారతీయులు, భారతీయ విద్యార్థులపై ఉక్రెయిన్‌ సైనికులు దాష్టీకానికి దిగుతున్నారు. ఉక్రెయిన్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే  భారతీయ విద్యార్థులను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. భారతదేశం రష్యా వైపు మొగ్గు చూపుతోందంటూ భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు హింసిస్తున్నారు. దీనిపై కొంత మంది భారతీయ విద్యార్థుల ఆవేదనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ukraine envoy  Ukraine  Russia  Indians  Indian students  Russian President Vladimir Putin  

Other Articles