Nadendla Manohar slams AP govt over Bheemla Nayak Movie వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపుపై విరుచుకుపడ్డ నాదేండ్ల

Janasena pac chairman nadendla manohar slams ap govt over bheemla nayak movie

Nadendla Manohar on Bheemla nayak, Nadendla Manohar on YSRCP govt, Nadendla Manohar on cinemas in Andhra Pradesh, Nadendla Manohar on Pawan Kalyan Bheemla neyak, Pawan Kalyan, Bhimla nayak, Janasena, Nadendla Manohar, YSRCP, YS Jagan Govt, Andhra Pradesh, Crime

Rudrapur Police arrested five women including the mother of the victim who has been sold for money a couple of times in the last two years. The woman along with her sister and other female friends indulged the victim in a sex racket and also made her marry three times, said police.

వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపుపై విరుచుకుపడ్డ నాదేండ్ల

Posted: 02/26/2022 06:51 PM IST
Janasena pac chairman nadendla manohar slams ap govt over bheemla nayak movie

ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఫ్యాన్స్‌ విజయవంతం చేస్తారని గుర్తు చేశారు. స్వయంగా ప్రభుత్వమే ఒక సినిమాపై కక్షగట్టి వ్యవహరించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రప్రథమం అని ధ్వజమెత్తారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు వ్యవహారాలతో మనజాలలేక ఆత్మగౌరవం ఉన్న నేతలు.. వైసీపీ ప్రభుత్వం నుంచి.. ఆ పార్టీ నుంచి బయటకు రావాలని మనోహర్‌ పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే.. జగన్ ఇలాంటి ప్రజావ్యతిరేక పాలనను అందిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని చూసి యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన జగన్‌.. పవన్ కల్యాణ్ నటించిన సినిమా విషయంలో మాత్రం అభిమానులను నిరుత్సాహపర్చేలా వ్యవహరించారన్నారు.

అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద భయభ్రాంతులు సృష్టించారని చెప్పారు. కక్షపూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ.. ప్రభుత్వప్రతిష్టను దిగజార్చే చర్యలను చేపట్టారని దుయ్యబట్టారు. తన ఆలోచన మేరకు అధికారులు పనిచేయాలనడం జగన్ కు తగదని నాదెండ్ల మనోహార్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవంతో బతికేందుకు వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా హుందాగా వ్యవహరించడం పట్ల పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Bhimla nayak  Janasena  Nadendla Manohar  YSRCP  YS Jagan Govt  Andhra Pradesh  Crime  

Other Articles