Ukraine Killed 3,500 Russians, Ex-President Says రష్యాన్ సైనికులకు ధీటుగా ఎదుర్కోంటున్న ఉక్రెయిన్ దళాలు

Ukraine military claims 3 500 russian soldiers killed 102 tanks and 14 planes destroyed

ukraine, russia, putin, russia ukraine war, Russia Ukraine War, Ukraine crisis, Henichesk, Russian soldiers, Kyiv, Ukraine, Russia- Ukraine crises, woman russian soilder facists, woman russian soilder occupiers, woman russian soilder enemies. Ukraine

Amid the ongoing Russian invasion of the country, Ukraine has now come forward to make big claims of defending its position. Ukraine on Saturday claimed that it has now destroyed a total of 14 Russian planes, 102 tanks and more in their defence against the invasion of Russian troops.

రష్యాన్ సైనికులకు పట్టపగలే చుక్కలు చూపుతున్న ఉక్రెయిన్ దళాలు

Posted: 02/26/2022 05:58 PM IST
Ukraine military claims 3 500 russian soldiers killed 102 tanks and 14 planes destroyed

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ అణుకేంద్రాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా స్పందిస్తోంది. లొంగిపోవాలన్న రష్యా సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌ సేనలు తమ తుదిశ్వాస వరకు పోరాడుతున్నారు. ఎంతో ఆయుధ సంపత్తి ఉండి అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్‌ కలిగిన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడి భారీ నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా జరుగున్న యుద్దంలో ఉక్రెయిన్‌ సైన్యం తగ్గేదేలే అంటూ తమ సామర్థ్యానికి మించి పోరాడుతోంది.

ర‌ష్యా ద‌ళాల‌ను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్న‌ట్లు ప‌శ్చిమ దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3500 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ త‌న ఫేస్‌బుక్ పేజీలో తాజాగా పేర్కొంది. అంతేకాకుండా మ‌రో 200 మంది ర‌ష్యా సైనికులను తాము అరెస్టు చేసిన‌ట్లు కూడా గర్వంగా వెల్లడించారు. ఈ క్రమంలో తమ దేశ సైనికులు రష్యాకు చెందిన 14 విమానాల‌ను, 8 హెలికాప్ట‌ర్ల‌ను, 102 యుద్ధ ట్యాంక్‌ల‌ను, 536 ఆర్మీ వాహనాలను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.

కాగా, సైనికుల మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రష్యా ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు కీవ్‌ నగరం వద్ద రష్యా బలగాలకు, ఉక్రెయిన్‌ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ బలగాలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles