Ukraine crisis: Volodymyr Zelensky says hes Russia's target నన్ను, నా కుటుంబాన్ని చంపడమే రష్యా టార్గెట్: జెలెన్ స్కీ

Zelensky says russian saboteurs are in kyiv and he is moscow s prime target

ukraine russia news, what is happening in ukraine, Russian military operation against Ukraine, Ukraine Russia War, Russia Invasion, Ukraine, Volodymyr Zelenskyy, Ukraine Crisis, Ukraine Russia Crisis, Ukraine crisis, Russia-Ukraine conflict, Ukrainian ambassador, Igor Polikha, Russia-Ukraine war, Ukraine-Russia crisis, Ukraine-Russia tension, Ukraine russia new, Prime Minister Narendra Modi,India on Ukraine, russia news, India

Ukrainian President Volodymyr Zelensky vowed on Friday to stay in Kyiv as his troops battled Russian invaders who are advancing toward the capital in the biggest attack on a European state since World War Two. Russia launched its invasion by land, air and sea on Thursday following a declaration of war by President Vladimir Putin.

నన్ను, నా కుటుంబాన్ని చంపడమే రష్యా టార్గెట్: జెలెన్ స్కీ

Posted: 02/25/2022 05:05 PM IST
Zelensky says russian saboteurs are in kyiv and he is moscow s prime target

ఉక్రెయిన్‌ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు మరింత ముందుకొచ్చాయి. రష్యన్ సేనలు కీవ్‌ను చేరుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈక్రమంలో నగరంపై వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని... ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆయన హెచ్చరికలు జారీచేశారు. నమ్ముకున్న దేశాలన్నీ తమను నట్టేట ముంచాయని నాటో సభ్య దేశాలను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఒక దేశంపై ఇంతలా బాంబు దాడులు, అక్రమణ సాగుతుంటే ప్రపంచ దేశాలన్నీ వేడుకను చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అన్ని దేశాలు ఒంటరి చేశాయి. చాలా దేశాల ప్రధానులతో మాట్లాడాం. ఎవరూ సాయం అందించేందుకు ముందుకు రావడం లేదు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయి. 27 యూరోపియన్‌ దేశాలను రక్షించమని అడిగాం. నాటో దళాలను నమ్ముకున్నా ఫలితం లేదు. ఉక్రెయిన్‌ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

తనను చంపడమే రష్యా తొలి టార్గెట్‌ అని, తన కుటుంబాన్ని అంతమొందించడం రెండో టార్గెట్‌ అని జెలెన్‌స్కీ భావోద్వేగానికి గురయ్యారు. రష్యాతో పోరాటంలో తాము ఒంటరివారమయ్యామని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఏదేమైనా తాను తన దేశాన్ని విడిచి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. కాగా, నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ఐలాండ్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ద్వీపంలో ఉన్న 13మంది ఉక్రెయిన్‌ బోర్డర్‌ గార్డ్స్‌ను రష్యా దళాలు చంపేసినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగిరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles