Strange fish found in Srikakulam శ్రీకాకుళంలో అమెజాన్ సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్..

Fisherman nets rare amazon sailfin catfish in srikakulam

Amazon Sailfin, Amazon Sailfin cat fish, Narayanapuram right cannal, fisher man, devil fish, Rajam fisheries inspector, Venkatesh, catfish species, Lizard fish, amphibious fish, poisonous fish, srikakulam, Andhra Pradesh

Amazon Sailfin Catfish was found in the Srikakulam district when some farmers were fishing in the Narayanapuram right bank canal. The villagers, who considered the fish dangerous, killed and buried it. The villagers say they have never seen this kind of fish with black colour and white stripes on it. The villagers noticed that it was trying to fly with the help of its wings. Rajam Fisheries Inspector Venkatesh said that it belongs to catfish species known as the Amazon Sailfin, also known as the lizard fish.

శ్రీకాకుళం కాలువలో విషపూరితమైన చేప.. అమెజాన్ సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్..

Posted: 02/25/2022 12:33 PM IST
Fisherman nets rare amazon sailfin catfish in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో వింత చేప దొరికింది. ఇది సాధారణ చేపలకు పూర్తి భిన్నంగా వుంది. చేప వీపు బాగంలో పురాతన కాలంనాటి వస్తువులపై ఉన్నట్లుగా దీనిపై గీతలు ఉన్నాయి. జిల్లాలోని నారాయణపురం కుడికాలువలో కొందరు రైతులు చేపలు పడుతుండగా, ఎంతో విచిత్రంగా ఉన్న ఈ చేప లభ్యమైంది. దీనికి కింది బాగంలో నోరు వుంది. కిందభాగాన్ని పరిశీలించి చూస్తే ఈ చేప దెయ్యం చేపలా కనిపించింది. దీంతో ఈ చేపను ప్రమాదకరమైనదిగా భావించిన గ్రామస్థులు దాన్ని చంపి భూమిలో పాతేశారు. నలుపు రంగు శరీరంపై తెల్లటి చారలతో ఉన్న ఈ చేపను తాము గతంలో ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ చేప మొప్పల వద్ద ఉన్న రెక్కలు చాలా బలంగా ఉన్నాయి. అది ఆ రెక్కల సాయంతో పైకిలేచే ప్రయత్నం చేయడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై రాజాం ఫిషరీస్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ స్పందించారు. ఇది ప్రధానంగా క్యాట్ ఫిష్ జాతికి చెందినదని, దీన్ని అమెజాన్ సెయిల్ ఫిన్, బల్లి చేప అని కూడా అంటారని చెప్పారు. ఈ చేపకు కింది భాగంలో నోరు ఉంటుందని, ఇది నీరు లేకుండా భూమిపైన కనీసం 15 నుంచి 30 రోజుల వరకు జీవించగలదని వివరించారు. ఈ తరహా చేపలు చెరువుల్లోకి ప్రవేశిస్తే చిన్న చేపలను తినేస్తాయని, ఇవి చెరువు యజమానులకు తీవ్రనష్టం కలిగిస్తాయని అన్నారు. ఇది విషపూరితమైన చేప అని, చంపేసి పూడ్చి వేయాలని సూచించారు. దీన్ని తినడం ప్రమాదకరం అని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles