shocking facts revealed by watchman ranganna in YS Viveka Murder case వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు

Ys viveka murder case shocking facts in watchman ranganna testimony

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, YSRCP state secretary, Devireddy SivaShanker Reddyy, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Key issues have come to light in the murder case of Andhra Pradesh Chief Minister YS Jagan Uncle YS Vivekananda Reddy. The CBI Charge Sheet states key points on the possible reasons for Viveka’s murder. The CBI had alleged in the Charge Sheet that YS Viveka was killed due to differences in the settlements.

వైఎస్ వివేక హత్యకేసు: వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు

Posted: 02/24/2022 11:09 AM IST
Ys viveka murder case shocking facts in watchman ranganna testimony

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలు ఏంటన్న విషయంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇందుకు భూలావాదేవీలు కారణమా.? లేక కడప పార్లమెంటరీ స్థానం కారణమా.? అన్న కోణాలతో పాటు దాదాపు అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన సీబిఐ ఇప్పటికే తొలి చార్జిషీటును న్యాయస్థానంలో దాఖలు చేసింది. గతేడాది అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో సిబిఐ సమర్పించిన చార్జిషీటు తాజాగా వెలుగుచూసింది. కాగా, వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలకు ప్రమేయం ఉందని సిబిఐ వారిపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.

ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే బి. రంగన్న మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వై.ఎస్‌.వివేకా ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్‌.. కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్‌ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే బి.రంగన్న వెల్లడించారు. ఆయన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదంటూ.. తన ఫోన్‌ నుంచే రాజశేఖర్‌కు కాల్‌ చేసి మాట్లాడించారని తెలిపారు.

అయితే రాజశేఖర్ తనతో మాట్లాడుతూ.. మార్గమధ్య దారిలో తన బండి (వాహనం) చెడిపోయిందని, మరమ్మతులు చేయించుకుని కాణిపాకం ఎప్పుడు చేరుతానో తెలియదంటూ రాజశేఖర్‌ సమాధానమిచ్చిన తర్వాత.. గంగిరెడ్డి ఆ ఫోన్‌ కాల్‌ కట్‌ చేసి సెల్‌ను తనకు ఇచ్చేశారని వివరించారు. 2019 మార్చి 14 ఉదయం ఈ ఘటనలు చోటుచేసుకోగా.. అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట గతేడాది జులై 23న రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. ప్రధానాంశాలివే.. తనను నరికిచంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరింపులకు పాల్పడటంతోనే తాను ఎవరికీ ఈ విషయాలు చె్ప్పలేదని అన్నారు.

‘హత్య జరిగిన రోజు రాత్రి వివేకా పడక గదిలో నుంచి ఇనుప సామాన్ల శబ్దం వచ్చింది. అంతలోనే ‘ఆ.. ఆ..’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఆ సమయంలో వివేకా పడకగదిలో నుంచి హాల్లోకి ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరితో పాటు మరో వ్యక్తి పదే పదే తిరుగుతూ కనిపించారు. అరుపులు వినిపించిన 20 నిమిషాల తర్వాత ఎర్ర గంగిరెడ్డి మినహా మిగతా ముగ్గురూ పారిపోయారు. తర్వాత కొద్దిసేపటికి ఎర్ర గంగిరెడ్డి ఆదరాబాదరాగా బయటకు వచ్చాడు. లోపల ఏం జరిగింది? వారు ముగ్గురు ఎందుకు పారిపోయారని ఆయన్ను ప్రశ్నించగా, ‘నీకెందుకు..ఎక్కువమాట్లాడితే నిన్ను నరుకతా’ అన్నారు.

2019 మార్చి 15న ఉదయం ఎర్ర గంగిరెడ్డి నన్ను పిలిచి.. రాత్రి జరిగింది ఎవరితోనైనా చెబితే నరికి పారేస్తానని బెదిరించారు. దాంతో తాను భయపడి ఎవరికీ చెప్పలేదు’ అని రంగన్న తన వాంగ్మూలంలో వివరించారు. ‘మీతో ఈ విషయం చెప్పినట్లు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకాను చంపిన వారికి తెలిసిపోయుంటందా? వాళ్లు నన్నేమైనా చేస్తారా?’ అంటూ వాంగ్మూలం ఇచ్చిన సమయంలో రంగన్న మేజిస్ట్రేట్‌ను అడిగారు. ‘నీ బాగోగులు వ్యవస్థ చూసుకుంటుంది’ అంటూ మేజిస్ట్రేట్‌ ఆయనకు సమాధానమిచ్చారు. ‘వివేకానందరెడ్డి ధర్మదేవుడు సార్‌... అలాంటి ఆయన్ను చంపారు. పిల్లోడు పిలిచినా పలుకుతాడు’ అంటూ రంగన్న కొన్ని సెకన్ల పాటు మేజిస్ట్రేట్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టు ద్వారా బుధవారం అందుకున్నారు. వాంగ్మూలంలో పేర్కొన్న వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టి.. మరికొందరు నిందితులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 21న మరోమారు పులివెందుల మేజిస్ట్రేట్‌ ఎదుట దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపై ఆధారాలు లభిస్తే సీబీఐ మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles