Varun Gandhi Targets Govt Over Unemployment ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచుతాయా.?: వరుణ్ గాంధీ

Varun gandhi targets govt over privatisation and unemployment

Varun Gandhi, BJP Pilibhit MP, country vital resources, privatisation, sky-high inflation, increasing unemployment, corrupt politics, selfishness pllitics, Uttar Pradesh, Politics

Targeting his own party's government over inflation and unemployment, local BJP MP Varun Gandhi said important resources of the country were being sold in the name of privatisation. Stressing that the country is passing through a difficult time, said inflation is touching the sky and unemployment is increasing rapidly.

ప్రైవేటీకరణతో.. లక్షల మంది నిరుద్యోగులు.?: మోడీ సర్కారుపై వరుణ్ గాంధీ

Posted: 02/22/2022 05:35 PM IST
Varun gandhi targets govt over privatisation and unemployment

అధికారంలో వున్న తన సొంత పార్టీపై ఉత్తర్ ప్రదేశ్ ఫిలిబిత్ ఎంపీ వ‌రుణ్ గాంధీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. నిన్నమొన్న‌టి వరకు రైతుల సమస్యలపై గళమెత్తిన ఆయన.. ఆ తరువాత రైతులకు మద్దతుధరపై చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సొంతపార్టీపై విమర్శలు సంధించడంపై మాట్లాడిన ఆయన తాను విప్లవాత్మక వ్యక్తినని, ప్రజలు సమస్యలతో బాధపడతుంటే తాను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
నిజాలను నిర్భయంగా మాట్లాడుతాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

అంతేకాదు ఏకంగా ప్ర‌ధాని మోదీ పాల‌న‌పై తీవ్రంగా మండిప‌డ్డిన ఆయన.. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కానీ.. వ్యాపారం చేయడానికి కాదు అంటూ దేశంలోని 26 ప్రభుత్వం సంస్థల నుంచి వాటాను ఉపసంహరించుకుంటామని డిపార్టుమెంటు అప్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ ప్రకటించడం.. అందుకు కేంద్ర క్యాబినెట్ కూడా అమోద ముద్ర వేయడంపై కూడా వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి చెందిన అత్యంత విలువైన అస్తులను, వనురులను అమ్మేస్తే దేశం గ‌తి ఏంకావాలి? అంటూ ఆయన సూటిగా ప్ర‌శ్నించారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌రుణ్ గాంధీపై కేంద్రంపై తీవ్రంగా మండిప‌డ్డారు. ప్రైవేటైజేష‌న్ పేరుతో అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణతో ఐదు లక్షల మందిని నిరుద్యోగులుగా మార్చడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించదని చెప్పారు. బ్యాంకులు, రైల్వేలు ప్రైవేటీకరణతో ఐదు లక్షల మంది బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. దీనర్థం వారు నిరుద్యోగులుగా మారుతున్నారని.. దీంతో లక్షల కుటుంబాల ఆశలకు ముగింపు పలుకుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అవినీతి వ్యవస్థ పై కఠిన చర్యలు తీసుకునేందుకు బలమైన ప్రభుత్వాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles