annual brahmotsavam in sri kapileswara swamy temple begins తిరుపతి కపిలేశ్వరస్వామికి వార్షిక ఏకాంత బ్రహ్మోత్సవాలు

Sri kapileswara swamy vari temple brhmotsavams from 22nd feb to 3rd march in ekantham

Sri Kapileswara Swamy, annual Brahmotsavam, Tirumala Tirupati Devastanam, Kapileswara Swamy Brahmotsavam Ekantam, Dwajarohanam, Tirupati, Chittoor, Andhra Pradesh, Spiritual, Devitional

Tirumala Tirupati Devastanam Board will be organizing the annual Brahmotsavam of Sri Kapileswara Swamy temple from February 22 to March 3 in Ekantam due to Covid-19 restrictions and Ankurarpanam performed on February 21, while Dwajarohanam conducted today.

తిరుపతి కపిలేశ్వరస్వామికి వార్షిక ఏకాంత బ్రహ్మోత్సవాలు

Posted: 02/22/2022 03:48 PM IST
Sri kapileswara swamy vari temple brhmotsavams from 22nd feb to 3rd march in ekantham

తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కొవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో కపిలేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వహించనున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వర స్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు.

ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. ఉత్సవాలను కొవిడ్‌ నిబంధన మేరకు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. అనంతరం కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఆల‌యంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ఈ బ్రహోత్సవాల ధ్వజారోహణ వేడుకలలో ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.

తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వాహన సేవల వివరాలు

22-02-2022: సాయంత్రం ధ్వజారోహణం (మీన లగ్నం) మరియు హంస వాహనం.
23-02-2022: ఉదయం సూర్యప్రభ వాహనం మరియు సాయంత్రం చంద్రప్రభ
24-02-2022: భూత వాహనం మరియు సింహ వాహనం
25-02-2022: మకర వాహనం మరియు శేష వాహనం
26-02-2022: తిరుచ్చి ఉత్సవం మరియు అధికారి నంది వాహనం
27-02-2022: వ్యాఘ్ర వాహనం మరియు గజ వాహనం
28-02-2022: కల్పవృక్షం మరియు అశ్వ వాహనం
01-03-2022: రథోత్సవం (భోగి తేరు) మరియు నంది వాహనం
02-03-2022: పురుషమృగ వాహనం, కల్యాణోత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం
03-03- 2022: శ్రీ నటరాజస్వామివారి రావణాసుర వాహనం, సూర్యప్రభ వాహనం, త్రిశూల స్నానం మరియు ద్వజవరోహణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles