Woman Cleans Window Hanging on Danger Ledge మహిళ దుస్సాహసం.. 4వ అంతస్థులో కిటికీ బయట నిల్చుని..

Ghaziabad woman cleans window hanging outside 4th floor ledge

Woman Hanging From Balcony And Cleaning Window, woman cleaning window panes, Ghaziabad woman cleaning windows, ghaziabad high rise appartments, ghaziabad woman viral video, Caught on camera, Shipra Rivera Society, Indirapuram, Dangerous Stunt Videos, Ghaziabad Viral Videos, Viral Clips, Shahidal, Mohammad Salim, Shruti Thakur, viral news, viral videos, Trending video

A video is doing rounds on the internet which has angered some of the netizens out of concern over the foolishness of the act. In a video, it can be seen that a middle-aged woman cleaning windows on her fourth-floor apartment from the outside ledge.

ITEMVIDEOS: మహిళ దుస్సాహసం.. 4వ అంతస్థులో కిటికీ బయట నిల్చుని..

Posted: 02/22/2022 02:01 PM IST
Ghaziabad woman cleans window hanging outside 4th floor ledge

సాధారణంగా ఇంట్లోకి దుమ్ముదూళి వస్తుంటుంది. ఇలావచ్చిన దుమ్మును ప్రతీరోజు ఇంట్లోని మహిళలు తూడిచేస్తుంటారు. అయితే ఓ ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగిన కుటుంబంలోని మహిళ ఇంటిని శుభ్రం చేసింది.. కానీ ఇంటి వెలుపల బాగంలో వున్న కిటీకీలకు దుమ్ము అలానే వుండటంతో ఇంట్లోకి వెలుతురు కూడా సరిగ్గా రావడం లేదని గ్రహించి.. వాటిని తుడిచేందుకు ఉపక్రమించింది. అయితే అమె చేసిన ఆలోచన కరెక్టే కానీ.. అందుకు అమె ఎంచుకున్న విధానమే ప్రస్తుతం నెటిజనుల విమర్శలను అందుకుంటోంది. ఎందుకంటే అమె తన కిటీకిలోంచి బయటకు వెళ్లి కిటికీ అంచునుండే చిన్న గోడ భాగంపై కాళ్లు పెట్టి మరీ అద్దాలు తుడిచింది.

కాగా, సదరు మహిళ ఫ్లాటు ఏకంగా అపార్టుమెంటులోని నాలుగు అంతస్తులో ఉంది. ప్రమాదకర రీతిలో కిటికీ బయటివైపు రెయిలింగ్​పై నిల్చొని.. అద్దాలు తుడిచింది. స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైంది. వివరాల్లోకి వెళ్తే.. దేశరాజధాని గజియాబాద్ లో ఇటీవల ఓ వీడియో నెటింట్లో వైరల్ అయ్యింది. లగ్జరీ అపార్టుమెంటులో ఉండే ఓ తల్లి తన కింది ఫ్లాటులో పడిపోయిన తన బట్టలను కోడుకు ప్రాణాలను పన్నంగా పెట్టి తీసుకోవచ్చేలా చేయడంతో అమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా అదే గాజియాబాద్​లోని ఇందిరాపురంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు మహిళకు ఎలాంటి ప్రమాదం జరగకపోయినా.. ఆమె నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.

శిప్రా రివేరా సొసైటీలో ఓ భవనంలోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న మహిళ షాహిదల్ తన భర్త మహమ్మద్ సలీంతో కలసి ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగింది. అయితే ఇళ్లంతా శుభ్రం చేసుకున్నా.. ఇంటికి ఓ వైపు కిటికీ వెలుపల బాగంలో దుమ్ము పేరుకుపోయింది. దీంతో దానిని శుభ్రం చేయడానికి రెయిలింగ్​పై నిల్చొని అద్దాలను తుడిచింది. ఓ దశలో ఒంటికాలిపై కిటికీపై నిల్చుంది. కొంచెం పొరపాటు జరిగినా.. కాలు జారి కింద పడే ప్రమాదం ఉంది. కానీ ఆ మహిళ మాత్రం ఇవేం ఆలోచించకుండా.. పూర్తిగా కిటికీ అద్దాలు తుడవడంపైనే దృష్టిపెట్టింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమాదకర రీతిలో ఇలా చేయడంపై విమర్శలు వెల్తువెత్తాయి.

సదరు మహిళ ప్రమాదపుటంచున నిల్చోని కిటికీలను శుభ్రం చేయడాన్ని గమనించిన ఎదురుగా ఉండే బ్లాకులోని శృతి ఠాకూర్ అమెను చూసి వీడియో తీశారు. ఆమెను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. గట్టిగా అరిచి ఆమెను పిలిచేందుకు యత్నించినా.. మహిళ వినిపించుకోలేదు. దీంతో కొంతమంది వెళ్లి ఆమె ఇంటి తలుపు కొట్టారు. అప్పుడు ఆమె వెళ్లి తలుపులు తీసింది. మహిళకు స్థానికులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ప్రమాదకరంగా కిటికీపై నిల్చోవద్దని సూచించారు. ఇటీవల ఎత్తైన భవనాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles