Brahmotsavams fest begins at Srisailam from today with ankurarpana శ్రీశైల మల్లన్న మహాశివారాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

11 day annual brahmotsavams fest begins from today at srisailam will conclude on march 4

Sri Bhramaramba Mallikarjuna Swamy, annual Brahmotsavam, Sri Bhramaramba Mallikarjuna Swamy, Brahmotsavam, Ankurarpanam, Srisailam, Endowments Commissioner, M. Hari Jawaharlal, Andhra Pradesh, Spiritual, Devitional

The Annual Brahmotsavams in relation to Sivaratri had started at the Sri Bhramaramba Mallikarjuna Swamy temple at Srisailam from today. The Auspicious fest begin with Ankurarpana today and will be concluded with Dwajavarohanam on March 4, said Endowments Commissioner M. Hari Jawaharlal at Srisailam. Sivaratri will be celebrated on March 1.

శ్రీశైల మల్లన్న మహాశివారాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Posted: 02/22/2022 01:13 PM IST
11 day annual brahmotsavams fest begins from today at srisailam will conclude on march 4

భూలోక కైలాసముగా ఖ్యాతిగాంచిన ద్వాదశ జోతిర్లింగాలలో రెండవదైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఇక్కడ మరో ఫుణ్యక్షేత్రమైన అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదైన శక్తిపీఠంగా బాసిలుతున్న నేపథ్యంలో మహాక్షేత్రంలో శివరాత్రిని పురస్కరించుకుని అంగరంగవైభవంగా వార్షిక బ్రహోత్సవాలకు ఇవాళ అంకురార్ఫణ జరిగింది. వచ్చేనెల 4 వరకు 11 రోజులపాటు జరిగే ఉత్సవాలకు వేదపండితులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు.

సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో బుధవారం నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు వసతి ఏర్పాటు పూర్తిచేశారు. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లును అధికారులు విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500 ,శీఘ్ర దర్శనం రూ.200 , ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.

శ్రీశైలం ఆలయంలో 2022 శివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు

22 ఫిబ్రవరి 2022 : అంకురార్పణ & ధ్వజారోహణం
23 ఫిబ్రవరి 2022 : హంస వాహన సేవ
24 ఫిబ్రవరి 2022 : మయూర వాహన సేవ
25 ఫిబ్రవరి 2022 : భృంగి వాహన సేవ
26 ఫిబ్రవరి 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాలు సమర్పణ
27 ఫిబ్రవరి 2022 : పుష్ప పల్లకి
28 ఫిబ్రవరి 2022 : గజ వాహనం
1 మార్చి 2022 : ప్రభోత్సవం & నంది వాహన సేవ. మహా శివరాత్రి. లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం. పాగలంకరణ. కల్యాణోత్సవం.
2 మార్చి 2022 : రథోత్సవం, సదస్యం, నాగవల్లి.
3 మార్చి 2022 : పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూల స్నానం, శివ దీక్షావిరమణ, ధ్వజారోహణం.
4 మార్చి 2022 : అశ్వవాహన సేవ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles