hard Treat to a Man, who tries to kick stray dog రోడ్డుపై కనబడిన వీధి కుక్క‌ను తన్నబోయి..

Man tries to kick stray dog but ends up falling hard in viral video

karma, dog video, man falls video, twitter, CCTV footage, innocent stray dog, man tries to kick stray dog, stray dog, Man, funny video, viral video, Video viral, animal video

The internet churns out some incredible videos that are bound to restore one’s faith in fate. This video shared on Twitter is a perfect example of what we are talking about. The video shows CCTV footage of a man walking on a street. As the video goes on, the man approaches an innocent stray dog and tries to kick it hard. Unfortunately, he slips and falls hard on his back instead.

ITEMVIDEOS: రోడ్డుపై కనబడిన బక్కపల్చని వీధి కుక్క‌ను తన్నబోతే.. ఏమైందో తెలుసా?

Posted: 02/22/2022 12:11 PM IST
Man tries to kick stray dog but ends up falling hard in viral video

ఖ‌ర్మ సిద్ధాంతాన్ని ఎవ‌రు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా.. దాని ప్రకారం అన్నీ జరుగాయని, జరుగుతున్నాయని, జరగబోతాయన్నది కాదనలేని వాస్తవమని కొందరు ఫక్తు నమ్మకం. అదే న్యూటన్స్ థర్డ్ లా.. చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య అయితే ప్ర‌కృతి స‌హ‌జం. అయితే ఇక్కడ సమానంగా కాదు అంతకు రెట్టింపు స్థాయిలో దానిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు హేతువాదులు దీనిని నమ్మకపోయినా.. ఇది నిజం. ఎంతలా అంటే ఈ క్రింది వీడియోలో అలాంటి ఘటనే మీకు ఎదురవుతుంది. దానిని వీక్షించిన తరువాత ఈ సిద్దాంతాన్ని తప్పక నమ్మాల్సిందేనంటారు.

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బొల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. అన్న పాట గుర్తుందా.? ఇలాంటి సంద‌ర్భాల్లో బొల్తా కోట్టినవారి బాధ కూడా ఫ‌క్కున న‌వ్వు తెప్పిస్తుంది. ఈ కోవ‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. క‌ద‌ల‌కుండా ఉన్న బక్కపల్చని వీధి కుక్క‌ను అదిలించి, ఓ వ్య‌క్తి పొర‌పాటు చేశాడు. తన బైక్ వద్ద అది నిలబడిందనో.. లేక బైక్ పై వున్న బ్యాగ్ లోంచి ఏదైనా లాగేస్తుందోమో అనో మొత్తానికి పోరబాటు చేసి.. ఎందుకిలా చేశాన్రా దేవుడా..! అని ముక్కుతూ.. మూలుగుతూ.. ఇబ్బంది ప‌డ్డాడు. ఉదయాన్నే ఏవరి ముఖం చూశానో ఇంతలా ఎదురుదెబ్బ తగిలింది అనుకున్నాడు.

సాయంత్రం వేళ ఓ వ్య‌క్తి వడాపావ్ ప‌ట్టుకొని తింటూ.. తన బైక్ వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడో ఓ వీధి కుక్క బైక్ వద్ద నిలబడటంతో దానిని కాలుతో త‌న్నబోయాడు. అది కాస్తా ముందుకు జరిగింది. దీంతో పట్టుతప్పిన వ్యక్తి హ‌టాత్తుగా వెల్లికిలా ప‌డ్డాడు. పాపం, ఏ తినుబండారం కోసం ఇలా చేశాడో అది కాస్త రోడ్డుపాలైంది. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యియి. దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌ను కింద‌ప‌డి, అదృష్టవశాత్తూ, కుక్క క్షేమంగా పారిపోతుంది. ఈ వైర‌ల్ వీడియోను ట్విటర్‌లో నేచర్‌హోలిక్ అనే ఖాతా షేర్ చేయ‌గా, ఇప్పటివరకు, క్లిప్ దాదాపు 380.5k వ్యూవ్స్‌, టన్నుల కొద్దీ లైక్‌లు, కేజీల కొద్దీ రీట్వీట్‌లు పొందింది. ఇక‌, ఈ వీడియోపై ట్వీట్ట‌ర్‌లో కామెంట్లు వెల్లువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karma  dog video  man falls video  twitter  CCTV footage  funny video  viral video  

Other Articles