Happy Twosday! Why numbers like 2/22/22 have been too fascinating ‘టూ’స్ డే.. ఎలా చూసినా ఒకేలా ఉండే అరుదైన రోజు.!

Twosday 2022 what is it know the significance of the date 22 2 22

Twosday, february 22, 22/2/22, no historical significance, special line-up of 2s, astrology, collaboration and community, palindrome date

Today, 22 February, 2022, is once-in-a-lifetime-day when the date numbers line up to be 22/2/22. The date is called a symmetrical or palindrome because the numbers read the same backward and forward. With 22/2/22 falling on Tuesday, social media users have have dubbed it Twosday.

‘ట్యూస్’ డే కాదు.. ‘టూ’స్ డే.. ఎలా చూసినా ఒకేలా ఉండే అరుదైన రోజు.!

Posted: 02/22/2022 11:10 AM IST
Twosday 2022 what is it know the significance of the date 22 2 22

ఈ రోజు ఎంతో స్పెష‌ల్. ఈ రోజుకు ఒక ప్ర‌త్యేక‌త కాదు రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ్‌. ఇంగ్లీష్‌లో ఇది ట్యూస్‌డే అలాగే, టూ’స్ డే కూడా! ఒక్క‌సారి పేప‌ర్‌పైన ఈ రోజు తేదీని అంకెల్లో రాసి చూడండి. ప్ర‌త్యేకమైన‌ది ఏదైనా దానికున్న‌ విలువ మ‌రింక దేనికీ ఉండ‌దు క‌దా! అందుకే, ఈ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌లో ఫిబ్ర‌వ‌రి 22వ తేదీకి అంత‌టి ప్ర‌త్యేక‌త ఉంది. ఈ రోజును అంకెల్లో రాస్తే… 22.02.2022. ఇది మ‌నం సాధార‌ణంగా రాసే ఫార్మాట్‌. ఇందులో స్పెష‌ల్ ఏంటంటే… ఎటువైపు నుంచి చ‌దివినా ఒకేలా ఉంటుంది. పాలిండ్రోమ్ అన‌మాట‌! అంతేకాదు, ఈ తేది ఆంబిగ్రామ్ కూడా… అంటే, త‌ల‌కిందులుగా చూసినా వాటిలో ఎలాంటి మార్పు ఉండ‌దు.

డిజిట‌ల్ క్లాక్‌లో ఓ సారి ఈ రోజు తేదీని గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది. ఈరోజుకు ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేన‌ప్ప‌టికీ, 200 సంవత్సరాల తర్వాత గానీ మళ్లీ 2వ నెంబ‌రు ఇలాంటి ఫార్మెట్‌లో వస్తుంది. అలాగే, మ‌న‌కు క‌నిపించిన‌ పాలిండ్రోమ్‌, ఆంబిగ్రామ్‌లు రెండూ గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 12, 2021న కూడా క‌నిపించాయి. అంకెల్లో 12.02.2021… ఇక‌, ఇలాంటి రోజు మ‌ళ్లీ రావాలంటే మ‌రో 58 ఏళ్లు ఆగాల్సిందే. అది ఫిబ్ర‌వ‌రి 8, 2080లో మ‌నం చూడొచ్చు. . ఇలాంటి పాలిండ్రోమ్ తేదీ చివరిసారిగా 11 జనవరి 2011న క‌నిపించింది.

డిజిట‌ల్ ఫాంట్‌లో రోమ‌న్ క్యాలెండ‌ర్‌ 8 అంకెల సిస్ట‌మ్‌లో ఇలాంటి ప్ర‌త్యేక‌మైన తేదిలను మ‌నం గ‌మ‌నించొచ్చు. అలాగే, నెల‌, తేది, సంవ‌త్స‌రం ఫార్మెట్‌లోనూ పాలిండ్రోమ్‌, ఆంబిగ్రామ్ తేదీలు క‌నిపిస్తాయి. మ‌రో 11 సంవత్సరాలు ఆగితే, మార్చి 3, 2033న ఇది క‌నిపిస్తుంది. 21వ శతాబ్దంలో ఇలాంటివి 12 పాలిండ్రోమ్ రోజులు ఉన్నాయి, మొదటిది అక్టోబర్ 2, 2001న (10-02-2001), చివరిది లీప్ డేలో వస్తుంది! 29 ఫిబ్రవరి 2092 (29-02-2092) 21వ శతాబ్దపు చివరి పాలిండ్రోమిక్ రోజుగా ఇది వ‌స్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles