Trespass attempt at NSA Ajit Doval's residence జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద ఆగంతకుడి కలకలం..

Man rams car into nsa ajit doval s residence gate police say mentally disturbed

Ajit Doval, NSA Ajit Doval residence, Bengaluru man, Ajit Doval, India's National security advisor, Ajit Doval attacked, Ajit Doval news, delhi news

A 43-year-old Bengaluru man, who claimed he was being remote controlled, rammed a rented car into the gate of National Security Advisor Ajit Doval’s residence in the national capital, sending security agencies scrambling. The man, who police say is mentally disturbed, was nabbed by security personnel after the incident. Security was also stepped up outside Doval’s Tughlak Road residence, with the police checking all vehicles.

జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద ఆగంతకుడి కలకలం..

Posted: 02/16/2022 06:55 PM IST
Man rams car into nsa ajit doval s residence gate police say mentally disturbed

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద ఆగంతకుడు కలకలం సృష్టించాడు. దోవల్ ఇంట్లోకి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అయితే తనను ఎవరో గుర్తుతెలియని కొందరు రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నారని, దాంతోనే తాను ఈ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తన శరీరంలో ఒక చిప్ సాయంతో అగంతకులు తనను నిత్యం నియంత్రిస్తున్నానని ధోవల్ నివాసం వద్ద పట్టుబడ్డ అనంతరం దుండగుడు చెప్పుకోచ్చాడు.

అయితే ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో దోవల్​ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా అతడ్ని స్కానింగ్ చేయగా ఎలాంటి ఎలక్ట్రానిక్ చిప్ లేదని తేలింది. దీంతో అతన్ని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకు చెందిన బెంగళూరువాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ  5, జన్‌పథ్‌లో ఉంది. ఐబీ మాజీ చీఫ్​, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్​ ఫ్లస్​ కేటగిరీ కింద భారీగా సీఐఎస్​ఎఫ్​ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యా​తో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్​ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్​ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్​ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles