Extramarital affair no reason to sack from service: Gujarat HC వివాహేతర సంబంధంపై కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు

Extramarital affair no reason to sack cop from service gujarat high court

Gujarat High Court, Extramarital affair is personal, Ahmedabad, Gujarat High court on extramarital affair, Justice Sangeeta Vishen judgement on extramarital affair, constable sacked from service, Ahmedabad police, Ahmedabad, Gujarat, Crime

The Gujarat High Court has observed that while an extramarital relationship can be seen as "an immoral act" from the society's standpoint, it cannot be considered a "misconduct" and a reason to sack a policeman under the police service rules. Justice Sangeeta Vishen made this observation while quashing the order to dismiss a police constable and directing the Ahmedabad police to reappoint him within a month and pay 25 per cent of back wages since November 2013 when he was sacked from service.

వివాహేతర సంబంధంపై కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు

Posted: 02/16/2022 08:05 PM IST
Extramarital affair no reason to sack cop from service gujarat high court

వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా పేర్కోన్నప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్ క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన గుజరాత్ రాష్ట్రోన్నత న్యాయస్థానం.. కానిస్టేబుల్ కు సానుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో అతనికి తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేశాలను కూడా జారీ చేసింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు న్యాయస్థానం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది. ఆ తీర్పు ప్రకారం "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే.  సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది.

అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్‌మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆజంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బందిపెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్‌మెంట్‌లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. న్యాయస్థానం తమ తీర్పులో కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించడానికి ఇది కారణం కాకుడదని పేర్కోంది. పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఇది చెల్లనేరదని.. కానిస్టేబుల్ ను విధుల్లో చేర్చుకోవడంతో పాటు అతడ్ని తొలగించిన కాలానికి గాను అతినిక 25శాతం జీతబెత్యాన్ని కూడా జమకట్టి ఇవ్వాలని అదేశఇంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles