Hundreds of birds fall to death in Northern Mexico ఆకాశంలో పక్షుల సమూహం.. అకస్మాత్తుగా భూమిని తాకి..

Astonishing video flock of birds drops dead in mexico experts hint at predator

birds drop dead, from sky mexico video, Birds in Mexico fall from the sky, Birds dropping dead in Mexico, birds fall from the sky in Mexico, Astonishing video, viral video, mysterious drop of black birds, Mexico bird video, animal viral video, bird suicide, bird viral video, Sky, Mexico, Predator, Flock, Experts, Birds fall

In a video shared by Reuters, hundreds of yellow-headed blackbirds are seen falling from the sky in the northern Mexican city of Cuauhtémoc. However, the cause of death is still not clear. A few experts said that it is likely that the flock was “flushed” from above by a predatory bird swooping down to make a catch. Footage features most of the birds managed to fly off but some of the black and yellow birds are scattered on the streets of the city.

ITEMVIDEOS: పక్షుల సమూహానికి ఏమైంది..? అకస్మాత్తుగా భూమిని తాకి.. ఎందుకిలా..

Posted: 02/15/2022 09:04 PM IST
Astonishing video flock of birds drops dead in mexico experts hint at predator

సూర్యోదయానికి కాసింత ముందు వెనుకల్లో.. లేదా సూర్యస్తామయ సమయంలో పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లకు వెళ్లడాన్ని గమనిస్తుంటాం. రెక్కలు విరుచుకుని అంతాకలసి ఆలా వెళ్తుంటే చిన్నారులు వాటిని చూసి తెగ సంబరపడుతుంటారు. అయితే ఏదో ఒక పెద్ద పక్షి చిన్న పక్షులపై దాడి చేసే ఘటనలు ఎంతో అరుదుగా కానీ వీక్షించం. ఇలా వివిధ రకాల అందమైన పక్షులు సందడి చేసి అలరించిన వీడియోలను అనేకం వీక్షించాం. కానీ వందలాది పక్షులు ఒక సమూహంలా ఏర్పడి ఎగిరిన దృశ్యాలను వీక్షించడం అత్యంత అరుదు.

ఇదిగో ఈ వీడియోలో చూస్తే వందలాది పక్షుల సమూహం ఒకేసారి ఆకాశంలో విహరిస్తూ అకస్మాత్తుగా భూమిపైకి వచ్చిపడటంతో వాటిలో పదుల సంఖ్యలో పక్షులు గాయాలపాలై చనిపోయాయి. నిర్ఘాంతపరిచే ఈ వీడియోల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మెక్సికోలో  పసుపు రంగు తలతో ఉన్న ఒకే రకమైన వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

అయితే ఆ వీడియోలో వందలాది పక్షలు ఒక సమూహంగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడి విగత జీవులుగా మారిపోయాయి. అందులో కొన్ని నెమ్మదిగా తేరుకుని ఎగిపోయాయి కూడా. నిపుణలు మాత్రం బహుశా ఒక వేటాడే పక్షి ఈ పక్షలు మందను వేటాడి ఉండవచ్చు. అప్పుడు ఒకేసారి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా కింద పడి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్‌ హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ మాట్లాడుతూ.. "పెరెగ్రైన్ లేదా హాక్ వంటి రాప్టర్ పక్షుల సమూహాన్ని వెంబడిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కోన్నారు.

ఆ క్రమంలో ఆ పక్షలు సమూహం వాటి నుంచి తప్పించుకునేందుకు సమూహంలా ఏర్పడి భూమిపై వాలేందుకు రాగా.. అనుకోకుండా అవి భూమిపై వున్న ఇళ్లు, విద్యుత్ తీగలు ఇతర వస్తువులను బలంగా తగిలడంతో అవి తీవ్రంగా గాయపడ్డాయని పేర్కోన్నారు. కాగా, ఆ సమూహంలోని చాలా వరకు పక్షులు తేరుకుని ఎగిరివెళ్లిపోగా, పదుల సంఖ్యలో మాత్రం పక్షులు అక్కడి చనిపోయాయని అన్నారు. అంతేకాదు వీడియో ఫుటేజ్‌లో వందలాది పక్షలు వీధుల్లో హఠాత్తుగా పడిపోయినట్లు కనిపించింది. పైగా అందులో చాలా వరకు ఎగిరిపోగా.. కొన్ని చెల్లాచెదురుగా  పడిపోయి చనిపోయి ఉన్నాయి. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు ఈ వీడియో వెనుక 5 జీ సాంకేతికత ఉందని కొందరు , మరికొందరేమో షార్ట్‌ సర్యూట్‌ జరడంతోనే అవి అలా పడిపోయాయి అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexico bird video  animal viral video  bird suicide  bird viral video  Sky  Mexico  Predator  Flock  Experts  Birds fall  

Other Articles