Former Union Law Minister Ashwani Kumar quits Congress అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు అశ్వని కుమార్ షాక్‌..

Ashwani kumar shreds congress over punjab leadership worst in 40 years

Congress, Sonia Gandhi, Ashwani Kumar, Former Union Minister, Ashwini Kumar quits Congress, Punjab Congress, Sonia Gandhi, Punjab CM Charanjit Singh Channi, Punjab Congress chief Navjot Sidhu, Amarinder Singh, Punjab, Politics

Former Union Minister Ashwani Kumar, who quit the Congress in the middle of state elections, fired several truth bombs at the party leadership, especially over its handling of infighting in Punjab. "The kind of leadership being projected in Punjab is probably the worst in the last 40 years," Ashwani Kumar

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు సీనియర్ నేత అశ్వని కుమార్ రాజీనామా..

Posted: 02/15/2022 08:18 PM IST
Ashwani kumar shreds congress over punjab leadership worst in 40 years

దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోంటోంది. పార్టీ నుంచి విడిపోయిన పలుకుబడి కలిగిన నేతలు ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేయడం.. వాటితో కాంగ్రెస్ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జాతీయంగా కాంగ్రెస్ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుండగా, జాతీయ స్థాయి సీనియర్ నేతలు మాత్రం పార్టీకి దూరం అవుతూనే వున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీకి పంపారు.

ఆ లేఖలో ఆయన తాజా పరిణామాలు, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదంగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీతో తనకున్న 46 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈయనకు బీజేపి మిత్రపక్షమైన అమరేందర్ సింగ్ పార్టీ వల విసిరిందని గుసగుసల వినిపిస్తున్నాయి.

అనంతరం అశ్వని కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా బాధకరమైన విషయమని అన్నారు. ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆత్మగౌరవానికి అనుగుణంగానే పార్టీ నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం తనను తాను కొత్తగా ఆవిష‍్కరించుకోలేకపోయిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభావం క్షీణిస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నిర్ణయాల వల్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు.

రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీ అ‍యిన కాంగ్రెస్‌ సవాళ్లను ఎదుర‍్కోవాల్సి ఉంటుందన్నారు. అయితే, తాను పార్టీని మాత్రమే వీడానాని క్రియాశీల రాజకీయాలను కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటానని తెలిపారు. కాగా, అశ్వని కుమార్‌ యూపీఏ హయంలో అక్టోబర్ 2012 నుండి మే 2013 వరకు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.  2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles