5 killed, several injured in Jharkhand accident జార్ఖండ్ జాతీయ రహదారిపై ట్రక్కు బీభత్సం..

Truck crashes into 5 vehicles on jharkhand highway 5 killed on spot

Jharkhand accident, Car rams into vehicles, Jharkhand truck accident, CCTV visuals, Rims Hospital, Patel chowk, Ramgarh, Jharkhand, Crime

Five people were killed on the spot when a truck smashed into at least five vehicles in a dramatic crash in Jharkhand. A chilling video of the accident shows the out-of-control trailer truck ramming into the vehicles on its way before crashing on top of a car, reducing it into a mangled heap.

ITEMVIDEOS: జార్ఖండ్ జాతీయ రహదారిపై ట్రక్కు బీభత్సం.. భయానకం..

Posted: 02/15/2022 09:51 PM IST
Truck crashes into 5 vehicles on jharkhand highway 5 killed on spot

జార్ఖండ్​ రాష్ట్రంలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఐదు వాహనాలను ఢీకొన్న ఘటనలో ఏకంగా ఐదుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాధబీభత్సానికి సంబంధించిన వీడియోను చూస్తే భయకంపితులై దాని నుంచి బయటపడేందుకు కొద్ది సమయం పడుతుంది. అంతటి భీతిగొలిపే ఈ ప్రమాదం జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్​గఢ్​లోగల జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఏకంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల యాక్షన్ సీన్​ను తలపించేలా ఉంది.

ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బీభత్సమే సృష్టించింది. ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్ని ట్రక్కు ఆ తరువాత ఎదురుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ట్రక్కులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో తీశారు. క్షతగాత్రులను స్థానిక రిమ్స్ అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనలో 6 వాహనాలు నుజ్జునుజ్జయినట్లు తెలిపారు. రామ్​గఢ్​లోని పటేల్ చౌక్​లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles