Mahindra says better leave town before hero comes ఊరొదలి వెళ్లిపోతానంటున్న ఆనంద్ మహీంద్రా..!

Ajay devgn lost his cool during mahindra ad shoot anand mahindra s reaction

anand mahindra, mahindra truck bus advertise shoot, advt script, Ajay Devgn, hero losses cool, change in script, anand mahindra reaction, publicity stunt, Mahindra Group, Twitter, social media, viral video

Industrialist Anand Mahindra, who is known for sharing interesting and witty posts on social media, took to Twitter to show his followers a video about the innovation of the motorised cycle. Imagine a cycle that can be turned into an electric vehicle with the help of one device. Imagine the opportunities it can create for many in a country like ours where mobility and transport continue to be a challenge in many quarters.

ITEMVIDEOS: ‘‘హీరోకు కోపం వచ్చింది’’ ఊరొదలి వెళ్లిపోతానంటున్న ఆనంద్ మహీంద్రా..!

Posted: 02/14/2022 05:34 PM IST
Ajay devgn lost his cool during mahindra ad shoot anand mahindra s reaction

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన. ఇటీవల ఐఐటీ చెన్నైకి చెందిన విద్యార్థుల సృజనాత్మకతకు ముగ్దుడైన ఆయన వారి 3డి ప్రింటింగ్ ఇళ్లు నిర్మాణం సంస్థలో తనను చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఇటీవల సైకిల్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ రూపోందించిన గురు సౌరబ్ కు కూడా అండగా వుంటానని ప్రోత్సహించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించి వెన్నుతట్టడం ఆయనలోని సుగుణం.  

అలాంటి ఆనంద్ మహీంద్ర ఏకంగా ఓ హీరోకు కోసం వచ్చింది.. తాను ఊరు విడిచి వెళ్తానంటూ చమత్కరించారు. తన సంస్థ రూపోందించిన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడం ఆనంద్ మహీంద్రాకు అలవాటే. అయితే ఇలా కొత్తగా రూపోందించిన ట్రక్కు బస్సుల ప్రమోషన్స్ కోసం ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. ఈ వీడియోకు మరింత వీక్షకుల తాకిడి పోందేలా చేశారు. అందుకు ఆయన ఫన్నీగా పెట్టిన కామెంట్టే కారణం.  

తాజాగా ఓ యాడ్‌ షూటింగ్‌ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మహీంద్రా ట్రక్ బస్‌ కోసం చేపట్టిన షూట్‌లో.. పదే పదే స్ట్రిప్ట్‌లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ అసహనంగా అడుగుతాడు అజయ్‌ దేవ్‌గన్‌.. పదే పదే మార్పులు చేయడం లేదు సార్‌ ఓ సాలుగైదు సార్లు అంతే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. వెంటనే  కెమెరావైపు ఓ సీరియస్‌ లుక్‌ ఇస్తాడు అజయ్‌ దేవ్‌గన్‌. ఈ వీడియోకు ఆనంద్‌ మహీంద్రా కామెంట్‌ రాస్తూ.. మహీంద్రా ట్రక్‌బస్‌ షూటింగ్‌లో అజయ్‌ దేవగన్‌కి కోపం వచ్చినట్టు నాకు తెలిసింది. మా ట్రక్‌ బస్‌ వేసుకుని ఆయన నా కోసం వచ్చేలోగా.. ఊరొదిలి పారిపోతానంటూ చమత్కరించారు ఆనంద్‌ మహీంద్రా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anand mahindra  Ajay Devgn  mahindra truck bus  publicity stunt  Mahindra Group  Twitter  viral video  

Other Articles