Hijab row: prohibitory orders in few schools and colleges హిజబ్ రగడపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Hijab row teacher asks students to take off hijab in karnataka

Karnataka college, Mahatma Gandhi Memorial College, Udupi, Karnataka HC, Basavaraj Bommai, Karnataka hijab row, Karnataka hijab ban, Karnataka High Court, Students Split, saffron shawls, religious wise students confrontation, Udupi, Karnataka, Politics

Amid ongoing controversy over wearing hijab in classrooms, arguments between parents and a teacher erupted outside Rotary School in Karnataka's Mandya as she asked students to take off hijab before entering campus. Asif, one of the parents, said the school administration is arguing with parents instead of allowing students in the classrooms.

హిజబ్: కర్ణాటక తెరుచుకున్న కాలేజీలు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 02/14/2022 04:47 PM IST
Hijab row teacher asks students to take off hijab in karnataka

క‌ర్నాట‌క‌లో హిజబ్ (బురఖా) వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చతూనే ఉంది. ముందుగా ఉడిపి, కొలార్ జిల్లాల్లోని పలు కాళాశాలకు మాత్రమే పరిమితిమైన ఈ వివాదాం ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ నేపథ్యంలో హిజబ్ పై వివాదం కర్ణాటక రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఇక న్యాయస్థానం కాళాశాలలు తెరవాలని అదేశాలు జారీ చేయడంతో ఇవాళ్టి నుంచి కర్ణాటకలో కాలేజీలు తెరిచారు. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించడం స‌రికాదని, యూనిఫాంలో మాత్ర‌మే రావాల‌ని డిమాండ్ వ‌స్తోన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రకటించింది.

దీంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠ‌శాల‌లోకి వ‌స్తుండ‌డాన్ని చూసిన‌ ఓ ఉపాధ్యాయురాలు వారిని అడ్డుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు. మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. పాఠ‌శాల‌లోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాల‌ని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో చివ‌ర‌కు హిజాబ్ తీసేసి విద్యార్థినులు పాఠ‌శాల‌లోకి వెళ్లారు. హిజాబ్‌తోనే పాఠ‌శాల‌లోకి అనుమ‌తించాల‌ని ఉపాధ్యాయురాలిని త‌ల్లిదండ్రులు వేడుకున్న‌ప్ప‌టికీ ఆమె వినిపించుకోలేదు.  

ఇదిలావుండగా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హిజబ్ పై వివాదంలో కల్పించుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, యువతులు హిజబ్ ధరించక పోవడం కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘హిబాజ్‌ అనే పదానికి ఇస్లాంలో పరదా అనే అర్థం ఉంది. యువతులు తమ అందాన్ని దాచుకోవడానికి హిజాబ్‌ను ధరించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మహిళలు హిజాబ్‌ ధరించకపోవడమే’’ అంటూ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగానే ఇతరుల నుంచి తమ అందాన్ని కాపాడుకోవాలనుకునే వారు హిజబ్ ధరిస్తారని ఆయన మాట మార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles