SC orders reinstatement of MP ex-woman judge వేధింపుల అరోపణలు చేసిన మహిళా జడ్జికి ఊరట

Sc directs mp high court to reinstate woman district judge who raised sexual harassment complaint

supreme court reinstatement of Additional District Judge who resigned after raising sexual harassment allegations, X v. Registrar General And Anr., Justices L. Nageswara Rao and B.R. Gavai, woman Additional District Judge (ADJ), sexual harassment complaint, sitting judge of the Madhya Pradesh High Court, resignation due to coercion, Madhya Pradesh Higher Judicial Services, supreme court, Additional District Judge, sexual harassment allegations, sitting judge, Madhya Pradesh High Court, Madhya Pradesh, Crime

In a significant judgment, the Supreme Court on Thursday directed the Madhya Pradesh High Court to reinstate a resigned woman Additional District Judge, who had raised sexual harassment allegations against a then sitting judge of the Madhya Pradesh High Court.

వేధింపుల అరోపణలు చేసిన మహిళా జడ్జికి ఊరట ఇచ్చిన సుప్రీం కోర్టు

Posted: 02/10/2022 07:14 PM IST
Sc directs mp high court to reinstate woman district judge who raised sexual harassment complaint

హైకోర్టు న్యాయమూర్తి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోన్నట్లు ఆరోపించిన దిగువ స్థాయి కోర్టు మహిళా న్యాయమూర్తికి ఊరట లభించింది. ‘న్యాయవ్యవస్థలో ఐటెం సాంగ్​ మరక’ గా మిగిలిపోయిన ఈ కేసులో మహిళా న్యాయమూర్తి 2014లో రాజీనామా చేశారు. అయితే అమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ మధ్యప్రదేశ్​ హైకోర్టును అదేశించింది. అమె సెలవు కాలాన్ని స్వచ్ఛంధ పదవీ విరమణగా కూడా పరిగణించరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది

బాధిత మహిళా న్యాయమూర్తి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయగా, దానిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఇవాళ అదేశాలను జారీ చేసింది. బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిన కారణంగా ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రాజీనామాను స్వచ్చంద విరమణ కింద పరిగణించకూడదంటూ కోర్టు మధ్యప్రదేశ్​ హైకోర్టుకు సూచించింది. అంతేకాదు మధ్యప్రదేశ్​ హైకోర్టు ఆమోదించిన ఆమె రాజీనామాను కొట్టేస్తున్నట్లు జస్టిస్​ గవాయ్​ తెలిపారు.   

అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే..

జూలై 2014లో, అదనపు జిల్లా న్యాయమూర్తి అయిన ఆమె.. హైకోర్టు జడ్జి నుంచి తనకు జరిగిన లైంగిక వేధింపుల ఎదురవుతున్నాయని ఆరోపణలకు చేశారు. ఈ వేధింపులపై అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె గ్వాలియర్‌లోని అదనపు జిల్లా న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసేసింది. ఓ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయాలని హైకోర్టు జడ్జి తనను కోరినట్లు లేఖలో ఆరోపించారు. అంతేకాదు సుదూర ప్రదేశానికి తనను బదిలీ చేయడాన్ని న్యాయమూర్తి ప్రభావితం చేశారని ఆమె ఆరోపించారు.

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో సదరు హైకోర్టు న్యాయమూర్తికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాదు లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం రాజ్యసభ తరపున ఒక ప్యానెల్ నియమించారు. ఈ ప్యానెల్​ గత ఏడాది డిసెంబర్‌లో నివేదిక ఇస్తూ.. హైకోర్టు న్యాయమూర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాది మహిళను వేధించడానికి న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేశారనే అభియోగంలో ఎటువంటి ఆధారం లేదని ప్యానెల్​ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత.. ఆరోపణలు చేసిన మహిళ.. తనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడాన్ని పరిశీలించాలని ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెకు చుక్క ఎదురు కాగా.. ఇప్పుడు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles