Monkey fever reported in Kerala's Wayanad దేశంలో మంకీ ఫీవర్ కలకలం.. కేరళలో తొలికేసు

Kerala reports year s first case of monkey fever patient admitted to hospital

Monkey fever reported in Kerala, Monkey fever, monkey fever in kerala, monkey fever kerala, Monkey Fever Symptoms, Monkey fever, Kerala Monkey fever, Kerala Monkey fever patient, Monkey fever Kerala, Monkey fever virus Kerala, Kerala Monkey fever virus, Monkey fever patient Kerala, Kerala, First case, Monkey fever, Monkey Fever Symptoms, Panavally tribal area, Thirunnelli village, Wayanad, kerala, Monkey fever news

A 24-year-old man from Panavally tribal settlement in Thirunnelli grama panchayat of the high-range district here has been inflicted with the Kyasanur Forest Disease (KFD) or more commonly known as monkey fever, health department officials said.

దేశంలో మంకీ ఫీవర్ కలకలం.. మొన్న కర్ణాటక.. తాజాగా.. కేరళలో

Posted: 02/10/2022 06:07 PM IST
Kerala reports year s first case of monkey fever patient admitted to hospital

కరోనా మూడో దశ దేశంలో తన ఉద్దృతిని క్రమంగా కొల్పోతుంది. అయితే కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం తొలిదశ, రెండవ దశలో అత్యధికంగా ఉండగా, మూడవ దశలో మాత్రం నామమాత్రంగానే వుంది. ఇకపై కరోనా వేరియంట్లు పుట్టుకోస్తే అవి సాధారణ ఫ్లూ స్థాయిలో ఉంటాయని కోందరు వైద్యనిపుణులు అంచనా వేస్తుండగా, మరికోందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇకపై పుట్టుకొచ్చే వేరియంట్లు అత్యంతవేగంగా అందరికీ వ్యాపించేవిగా వుంటాయని.. రోగ నిరోధకశక్తితో పాటు వాక్సీన్ యాంటీబాడీలకు కూడా చిక్కకుండా తమ ప్రభావాన్ని చూపుతాయని అంచనా వేస్తున్నారు.

అయితే వాటి లక్షణాలు తీవ్రంగా ఉంటాయా.? లేక తేలిగ్గా ఉంటాయా.? అన్నది అప్పుడే తెలుస్తుందని అంటున్నారు. ఇదలాఉంచితే ప్రస్తుతం దేశంలో కేరళ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలో ఓ కేసు నమోదవగా.. తాజాగా కేరళ వయనాడ్​ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకినట్లు తేలింది. జ్వరంతో ఆస్పత్రికి చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్​ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు. వారు అనుకున్నదే నిజమైంది. మనంతవాడీ వైద్య కళాశాలలో బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్​ కేసు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంకీ ఫీవర్​ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్​ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles