RPF Jawan saves Man falling under moving train వేగాన్నందుకున్న రైలు దిగబోయి.. కొద్దిలో తప్పిన ముప్పు

In telangana rpf jawan saves man s life as he slips from moving train

pradham kumar, M.V.Rao, ASI RPF, Home guard, Running Train, Warangal railway station, railway protection force, warangal, bihar migrant, Telangana

A migrant worker from Bihar was rescued by RPF staff after he fell on the platform while trying to disembark from a moving train at Warangal railway station. The passenger, Pradham Kumar (22), had accidentally boarded the wrong train and fell when he tried to get down.

ITEMVIDEOS: రన్నింగ్ రైలు దిగబోతూ కిందపడి.. వెంట్రుకవాసిలో తప్పిన ముప్పు

Posted: 02/10/2022 04:24 PM IST
In telangana rpf jawan saves man s life as he slips from moving train

రైలు ప్రయాణాలు ఎంత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయో అదే రీతిలో రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు అప్రమత్తంగా లేకపోతే అంతీ భీతిగోలుపుతాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు అనేకం రైల్వేస్టేషన్లలోని సిసిటీవీ కెమెరాల్లో నిక్షిఫ్తం కావడంతో వాటిని తమ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పెట్టి.. రైలు ప్రయాణికులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది రైల్వేశాఖ. అయినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే వున్నాయి. తాజాగా రన్నింగ్‌ రైలులో నుంచి దిగుతూ కిందపడిపోయిన ప్రయాణికుడిని రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కాపాడింది.

ఈ ఘటన వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం 1లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరంగల్‌ ఆర్పీఎఫ్‌ సీఐ టీఎస్‌ఆర్‌ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం జహనాబాద్‌కు చెందిన ప్రధూమ్‌కుమార్‌(22) వరంగల్‌లోని బాలాజీ రైస్‌ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్‌ నుంచి సూరత్‌ వెళ్లుటకు టికెట్‌ తీసుకుని నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం ప్లాట్‌ఫాం నంబర్‌ 1లో వేచియున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫాం 1నకు వచ్చింది. హడావిడిగా అది ఏ రైలో తెలుసుకోకుండా ప్రధూమ్‌కుమార్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు.

అది కదిలి స్పీడుగా వెళ్తున్న క్రమంలో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ కాదని తెలుసుకుని వెంటనే దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వరంగల్‌ ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ ఎంవీ రావు, హోంగార్డు ఆమిరిశెట్టి మహేష్‌లు గమనించి వెంటనే అప్రమత్తమై ప్రధూమ్‌కుమార్‌ను పట్టుకుని బయటకు లాగారు. దాంతో ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ సిబ్బందిని ప్రయాణికులు, అధికారులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles