Painting vandalised by ‘bored’ Security guard బోర్ కొడుతుందని చేసిన పనితో.. రూ.7 కోట్ల నష్టం

Bored security guard draws eyes on rs 7 47 crore painting of faceless figures

museum artwork ruined, painting at museum ruined, painting ruined by bored security guard, bored security guard defaces painting in Russia, security guard draws eyes on 740,000-pound painting, security guard, faceless figures, painting, draws eyes, bored security guard, guard draws eyes, security guard painting, Insurance, russia

A 7,40,000 Pound painting at a Russian gallery was defaced by none other than the person entrusted to protect it: a security guard. According to The Art Newspaper, the guard used a ball pen to draw eyes on the faceless figures depicted in the painting by abstract artist Anna Leporskaya.

చేయకూడని పని చేసి.. ఉద్యోగం ఉష్.. రూ.7 కోట్ల నష్టం.. నెటిజనుల అండ

Posted: 02/10/2022 03:22 PM IST
Bored security guard draws eyes on rs 7 47 crore painting of faceless figures

కొందరు సరదాగానో లేక బోరుకొడుతుందనో తమలోని సృజనాత్మకతతో చేసే పనులు స్పందేహం లేకుండగా వారికి చక్కటి గుర్తింపును తీసుకువస్తాయి. వారి సృజనాత్మకతకు మంచి మార్కులు పడటంతో పాటు వారిని కూడా వెలుగులోకి తీసుకువస్తాయి. అయితే కొన్న సందర్భాల్లో అనాలోచితంగా చేసినా.. కొందరికి అదృష్టం బాగుండి గుర్తింపు లభిస్తుంది. అచ్చంగా ఇలాగే కొందరు తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శించబోయి బొక్కబోర్లా పడటం కూడా తెలిసిందే. వారు చేసిన పనులు వికటించి పెను ప్రమాదాలు.. భారీ నష్టాలను కూడా మిగుల్చుతాయి అచ్చం అలాంటి సంఘటనే రష్యాలో చోటుచేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...1932-1934 నాటి త్రీ ఫిగర్స్‌ అనే పెయింటింగ్‌ని అన్నా లెపోర్స్కాయ ప్రదర్శన నిమిత్తం రష్యాలోని యోల్ట్సిన్‌ సెంటర్‌లో ఆకర్షణగా వేలాడదీసి ఉంచారు. ఆ తర్వాత పెయింటింగ్‌ని డిసెంబర్ 7, 2021న 'ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్' ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ ప్రైవేట్‌ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు బోర్‌కొట్టి ఏం చేయాలో తోచక ఆ పేయింటింగ్‌లో ఉన్న ముఖ చిత్రాలపై బాల్‌ పెన్‌తో కళ్లు గీశాడు. దీంతో సదరు ప్రైవేట్‌ కంపెనీ సెక్యూరిటీ గార్డుని విధుల నుంచి తొలగించింది.

ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌కి జరిగిన నష్టం సుమారు రెండు లక్షలు వరకు ఉంటుందని అంచన  వేశారు. అయితే ఈ పేయింటింగ్‌ విలువ ఎంత అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ పెయింటింగ్‌ని దాదాపు రూ. 7.47 కోట్లతో బీమా చేసి ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పాపం ఆ ప్రైవేట్‌ కంపెనీ ఆ పేయింటింగ్‌ పునరుద్ధరణ నిమితం డబ్బులు వెచ్చిస్తోంది. అంతేకాదు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు కూడా. అయితే నెటిజనులు మాత్రం సెక్యూరిటీ గార్డుకు అండగా నిలుస్తున్నారు. ఆ కనులతో సెక్యూరిటీ గార్డు ఆ కళాత్మకతకు జీవం పోశాడని కితాబిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles