Glenmark launches first nasal spray for Covid patients కరోనా చికిత్స గ్లెన్ మార్క్ ముందడుగు.. తొలి నాసల్ స్ప్రే లాంచ్

Glenmark in partnership with sanotize launches fabispray in india for treatment of covid 19

Glenmark, SaNOtize, FabiSpray, COVID-19, Nitric Oxide Nasal Spray (NONS), SARS-CoV-2, DCGI, Adverse Events, AE, pharma healthcare News, Latest pharma healthcare News

Glenmark Pharmaceuticals Limited and Canadian pharmaceutical company SaNOtize Research & Development Corp. has launched FabiSpray in India for the treatment of adult patients with COVID-19 who have high risk of progression of the disease.

కరోనా చికిత్స గ్లెన్ మార్క్ ముందడుగు.. తొలి నాసల్ స్ప్రే లాంచ్

Posted: 02/09/2022 08:11 PM IST
Glenmark in partnership with sanotize launches fabispray in india for treatment of covid 19

కరోనా మూడో దశ దేశంలో తన ఉద్దృతిని క్రమంగా కొల్పోతుంది. అయితే అది సృష్టించిన భీభత్సంతో తొలిదశ, రెండవ దశలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దేశంలో రోడ్ల పక్కన, నదుల్లోనూ కోవిడ్ మృతదేహాలే కనిపించి అల్లకల్లోలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ రావడంతో ప్రజలకు కాసింత ధైర్యం కూడగట్టుకున్నారు. కరోనాకు పలు దేశాలు పలు రకాల టీకాలను కనుగోన్నారు. అయితే టీకాల ప్రభావం కేవలం ఆరుమాసాలేనని, తరువాత యాంటీబాడీలు తగ్గుముఖం పడుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అయినా టీకాలు తీసుకుని కరోనా నుంచి రక్షణ పోందాలని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ తీసుకోవాలని ఎంతమంది వైద్యులు చెబుతున్నా సూది మందుకు జంకుతున్న పలువురు దేశ ప్రజలు మాత్రం అటువైపు అడుగుకూడా వేయడం లేదు. ఇక కరోనా వచ్చిన రోగులకు కూడా రెమిడిసివిర్ మందు ఇంజక్షన్ రూపంలోనే అందుబాటులో వుంది. అయితే సూది భయం ఉన్నవారి కోసం విధానం అందుబాటులోకి వచ్చింది. పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో ముందుండే గ్లెన్ మార్క్ ఫార్మా.. కరోనా చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్) ఔషధాన్ని సైతం ఈ సంస్థ అన్ని కంపెనీల కంటే ముందుగా రోగులకు అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. తాజాగా ‘ఫ్యాబి స్ప్రే’ పేరుతో నాసల్ స్ప్రేను విడుదల చేసింది. ఇందుకు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం పొందింది.

ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. కరోనా వైరస్ లోడ్ ను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు గ్లెన్ మార్క్ ఫార్మా చెబుతోంది. ‘‘ఫేస్ 3 పరీక్షల్లో వైరల్ లోడ్ ను 24 గంటలలో 94 శాతం మేర, 48 గంటలలో 99 శాతం మేర తగ్గిస్తున్నట్టు తేలింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే సురక్షితమైనది’’ అని సంస్థ ప్రకటన విడుదల చేసింది. ముక్కులో స్ప్రేను కొట్టుకుంటే శ్వాస వ్యవస్థలోకి వెళ్లకుండా వైరస్ ను అడ్డుకుంటుందని గ్లెన్ మార్క్ అంటోంది. ‘‘శ్వాసకోస వ్యవస్థ ఎగువ భాగంలోనే వైరస్ ను చంపేసే లక్ష్యంతో ఫ్యాబి స్ప్రేను అభివృద్ది చేయడం జరిగింది. దీనికి యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు రుజువైంది. కరోనా వైరస్ మరిన్ని వైరస్ కణాలను ఉత్పత్తి చేసుకోకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది’’ అని గ్లెన్ మార్క్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Glenmark  SaNOtize  FabiSpray  COVID-19  Nitric Oxide Nasal Spray (NONS)  SARS-CoV-2  DCGI  

Other Articles