Covid Third Wave Ended In Telangana: Health Director తెలంగాణలో ఒమిక్రాన్ కథ ముగిసింది: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీనివాసరావు

Covid third wave ended in telangana says health director dr srinivasa rao

Corona third wave, Telangana covid third wave, Public Health Director, DH Srinivas Rao, Telangana Cororna cases, IT offices, work-from-home

State Public Health Director Dr Srinivasa Rao on Tuesday said that the third wave of the corona has ended in Telangana. He said IT offices no longer need a work-from-home. He also said there were no more restrictions in the state as the third wave ended in Telangana.

తెలంగాణలో ఒమిక్రాన్ కథ ముగిసింది: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీనివాసరావు

Posted: 02/08/2022 06:10 PM IST
Covid third wave ended in telangana says health director dr srinivasa rao

కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై డీహెచ్‌ మాట్లాడుతూ..  మూడో దశ డిసెంబర్ నుంచి ప్రారంభమైందని, జనవరిలో మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందన్నారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసులు లక్షలోపే నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందన్నారు.

రెండేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడించిందని డీహెచ్‌ అన్నారు. ‘కోవిడ్‌ మొదటి దశ వల్ల 10 నెలలు ఇబ్బంది పడ్డాం. సెకండ్‌ వేవ్‌ ఆరునెలలు పాటు ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ కేవలం రెండు నెల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో మొత్తం కేవలం 3 వేల  మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు’ అని వెల్లడించారు. ‘ఫీవర్‌ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. కోవిడ్‌ నియంత్రణలో వ్యాక్సిన్‌ కీలక ఆయుధంగా పనిచేసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు త్వరగా వాక్సీన్ తీసుకోవాలని సూచించారు.

‘రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవని.. ప్రభుత్వం విధించిన ఆంక్షలు జనవరి 31 వరకే పరిమితమని.. ప్రస్తుతం కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినందున వాటిని కూడా పూర్తిగా ఎత్తివేశామని ప్రభుత్వం తెలిపింది. అన్ని సంస్థలు 100 శాతం పనిచేయొచ్చు. ఉద్యోగులు అందరూ కార్యాలయాకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రం హోం తీసేయొచ్చు. విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి టీకాలు వేశాలు. 82శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చాం. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు. కోవిడ్‌ త్వరలో ఎండమిక్‌ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా మారుతుంది.’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles