Priyanka Gandhi hits back PM Modi for Covid spread కేంద్రం అనాలోచిత నిర్ణయాలే ప్రజలకు శాపాలు: ప్రియాంక గాంధీ

What about your big rallies priyanka gandhi hits back after pm modi blames congress for covid spread

priyanka gandhi vadra, narendra modi, Corona spread, lok sabha, congress, PM Modi Congress, budget session, parliament, motion of thanks, pm narendra modi, corona congress parliament, motion of thanks, National, Politics

Congress general secretary Priyanka Gandhi Vadra slammed Prime Minister Narendra Modi after he blamed Congress for egging on the migrants to leave Mumbai in the first wave of the coronavirus disease (Covid-19) pandemic, which eventually led to the Covid-19 spread in states like Uttar Pradesh, Uttarakhand, Punjab and Bihar.

కేంద్రం అనాలోచిత నిర్ణయాలే ప్రజలకు శాపాలు: ప్రియాంక గాంధీ

Posted: 02/08/2022 05:21 PM IST
What about your big rallies priyanka gandhi hits back after pm modi blames congress for covid spread

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ప్రజలకు శాపాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. దేశంలో కరోనా మహమ్మారి వచ్చేవరకు చేష్టలుడికి చూసిన ప్రధాని కరోనా వచ్చి ప్రబలుతున్న క్రమంలో హాడావిడిగా నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ విధించారని.. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ పట్టణాలకు పోట్టకూటి కోసం వెళ్లిన వలస కూలీలు పస్తులతో ఉన్నారన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు.

పనులు లేక.. పస్తులు ఉండలేక, చిన్నారులు, చంటిబిడ్డలతో వారు కాలినడకన వందల కిలోమీటర్ల దూరం వెళ్లారని ఆమె అప్పటి ఉదంతాలను ప్రస్తావించారు. అలాంటి వారికి ఉచితంగా రైలు టికెట్లు ఇచ్చి, వారి స్వస్థలాలకు పంపితే.. దీంతోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందని.. కాంగ్రెస్ పార్టీ కొవిడ్ వ్యాప్తికి కారణమని ప్రధాని మోదీ చేసిన విమర్శలను అమె తిప్పికోట్టారు. రెండోదశ వేళ ప్రధాని చేపట్టిన ఎన్నికల ర్యాలీల సంగతేంటంటూ దీటుగా ప్రశ్నించింది. గోవా రాజధాని పనాజీలో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రధాని చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు.

వలసకూలీలను ఎవరూ సహాయం చేయకూడదని ఆయన కోరుకున్నారా? ఆయనకు ఏం కావాలి? కరోనా సమయంలో ఆయన నిర్వహించిన భారీ ర్యాలీల మాటేంటి?’ అంటూ తీవ్రంగా ప్రియాంకా గాంధీ విమర్శించారు. దేశప్రజలపై తనకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించే ప్రధాని మోడీకి పెద్ద నోట్ల సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు మీ దృష్టికి రాలేదా.? నోట్ల రద్దు నేపథ్యంలో ఎంత మంది ప్రజలు క్యూలలో నిలబడలేక నిరసించి, గుండెపోటుకు గురై మరణించారో మరిచారా.? కేంద్రప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తప్ప చేసిందేమీ లేదని అమె తీవ్రంగా మండిపడ్డారు.

ఆ సమయంలో ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు. వారికి తినడానికి తిండి, నీళ్లు, బట్టలు లేవు. వారికి సహాయం చేయడం తప్పా? మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను నిందించడం సరికాదు’ అంటూ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. గతేడాది పలు రాష్ట్రాలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటికే కేసులు పెరుగుతున్నా.. పార్టీలు ప్రచారాన్ని కొనసాగించాయి. అనంతరం కరోనా రికార్డు స్థాయిలో విజృంభించి.. భారత్‌ను వణికించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles