Assam Journalist Assaulted By Cops On Camera జర్నలిస్టుపై పోలీసుల జులుం.. ప్రశ్నించడమే నేరమా.?

Assam journalist gets beaten up by police after he asks why they did not wear helmets

Assam journalist beaten up, assam journalist beaten up, assam journalist beaten, Assam journalist beaten up, Constables attack Assam journalist, Assault on media personnel, Journalists under attack in India, Media attacks India, Jayanta Debnath, Assam Police, Assam, Crime

A 47-year-old journalist, identified as Jayanta Debnath, was beaten up by two constables of the Assam Police Monday after the former questioned them for not wearing helmets while on a two-wheeler. Several local press clubs expressed outrage over the incident that took place in Basugaon of Chirang district.

‘హెల్మెట్ పెట్టుకోలేదేం’ అని అడిగితే.. జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డ పోలీసులు

Posted: 02/08/2022 03:11 PM IST
Assam journalist gets beaten up by police after he asks why they did not wear helmets

పాత్రికేయులంటే సమాజంలోని మరో కోణాన్ని ధైర్యంగా వెలుగులోకి తీసుకువస్తారని ప్రజల్లో చక్కని అభిప్రాయం ఉంది. అయితే కొన్నిసందర్భాల్లో పోలీసు కేసులను, ముష్కర మూకల దాడులను సైతం ఎదుర్కొన్ని నిజాన్ని వెలుగులోకి తీసుకురావడం చేస్తుంటారు. ఇక కొన్ని సందర్భాలలో సమాజంలోని చీకటి కోణాలను బహిర్గతం చేసే క్రమంలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటారు. అధికార ప్రభుత్వానికి లేదా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా రాసే పత్రికా సంస్థలు, జర్నలిస్ట్‌లపై ఎలాంటి దాడులు జరుగుతుంటాయో తెలిసిందే. ఇక పోలీసులకు మీడియా జర్నలిస్టులకు మధ్య జరుగుతున్న పోరు చెప్పనలవి కాదు.

పోలీసుల జులుం ప్రశ్నించే హక్కు కలిగిన జర్నలిస్టులపై ఈ మధ్యకాలంలో దాడులు అధికమయ్యాయి. తాజాగా ఇక్కడొక జర్నలిస్ట్‌ పోలీసులను కేవలం ప్రశ్నించినందుకు అతని పై అత్యంత అమానుషంగా దాడిచేశారు. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలోని జయంత్ దేబ్‌నాథ్‌ ఇద్దరు కానిస్టేబుళ్లని హెల్మట్‌ ఎందుకు ధరించలేదని ప్రశ్నించాడు. ప్రజలకు చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని అన్నారు. అంతే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు దేబ్‌నాథ్‌పై కోపంతో దాడికి చేయడమే కాక బలవంతంగా జీపులో కూర్చోబెట్టేందుకు మరింతమంది పోలీసులను పిలవడం వంటివి చేశారు. పైగా తాను జర్నలిస్ట్‌ని అని చెప్పినందుకే మరింత దారుణంగా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన అస్సాంలోని చిరాంగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో జర్నలిస్ట్‌ దేబ్‌నాథ్‌ మాట్లాడుతూ..." సమాజంలో శాంతి భద్రతలను సంరక్షించే పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించడం తప్పా. ఈ విషయమే నేను అస్సాం ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. నాపై దాడి చేసినవారిపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలి అని అస్సాం ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లాబా క్ర దేకా ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam journalist  beaten up  Constables  Jayanta Debnath  Helmets  Assam Police  Basugaon  Chirang district  Assam  Crime  

Other Articles