Forest official captures slithering cobra ఒంటిచేత్తో కింగ్ కోబ్రాను పట్టిన అటవీశాఖ మహిళా ఉద్యోగి..

Forest official captures cobra that slithered into a house in kerala

Snake, Snake rescue in Kerala, Snake rescue in Thiruvananthapuram, Snake rescue in Kattakkada, viral snake video, brave forest staff, woman staff captures snake, kerala forest department, forest officer in kerala, viral video, video viral, trending video

A woman official of the forest department, confirmed to be Roshini GS, deftly and patiently rescued a cobra. The rescue operation at a house in Kattakkada of Kerala's Thiruvananthapuram district was caught on camera and shared online, creating a buzz and earning the official much praise.

ITEMVIDEOS: ఒంటిచేత్తో కింగ్ కోబ్రాను పట్టిన అటవీశాఖ మహిళా ఉద్యోగి..

Posted: 02/08/2022 01:26 PM IST
Forest official captures cobra that slithered into a house in kerala

పాములను చూస్తే చాలు భయంతో కెవ్వున కేక వేస్తాం. ఇక అందులో విషనాగులను, కొడెనాగులను చూశామంటే చాలు.. భయంతో వణుకు పుట్టడం గ్యారెంటీ. దాని నుంచి తప్పించుకునేందుకు తరోణోపాయాలను అలోచిస్తాం. అయితే ఎలాంటి పాములనైనా ఇట్టే పట్టుకునే కొందరిలోని ధైర్యాన్ని చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. అయితే సాధారణ పాములను పట్టడం వేరు.. కింగ్ కోబ్రాలను పట్టుకోవడం వేరు. కింగ్ కోబ్రాల అత్యంత విషపూరితమైనవే కాదు.. వెగంగా ప్రత్యిర్థలను కాటు వేయడంలోనూ ఘనాపాటీలు.

అలాంటి కింగ్ కోబ్రాను కూడా ఒంటి చేత్తో పట్టుకున్న ఓ అటవీశాఖ అధికారికి నెటిజనులు నిరాజనాలు పడుతున్నారు. ఇక ఆ అటవీశాఖ మహిళా అధికారి కావడంతో అమెపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం జిల్లాలోని క‌ట్ట‌క్క‌డ గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపామును స్థానికులు గుర్తించారు. అనంత‌రం అట‌వీశాఖ అధికారుల‌కు వారు స‌మాచారం అందించారు. దీంతో అట‌వీశాఖ‌కు చెందిన రోషిణి అనే మ‌హిళా ఉద్యోగి త‌న బృందంతో అక్క‌డికి చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న కింగ్ కోబ్రాను రోషిణి త‌న బృందంతో క్ష‌ణాల్లోనే ప‌ట్టేసింది.

అనంత‌రం ఆ పామును సమీప అడ‌వుల్లో వ‌దిలేశారు. అయితే రోషిణి పామును ప‌ట్టిన దృశ్యాల‌ను ఇండియ‌న్ ఫారెస్టు స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుధా రామేన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అట‌వీశాఖకు చెందిన రోషిణి అనే మ‌హిళా ఉద్యోగి ధైర్యంగా నాగుపామును ప‌ట్టింద‌ని సుధా రామేన్ ప్ర‌శంసించారు. ఆమె పాముల‌ను ప‌ట్ట‌డంలో శిక్ష‌ణ పొందింద‌ని తెలిపారు. దేశ వ్యాప్తంగా అట‌వీశాఖ‌లో మ‌హిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంద‌న్నారు. తిరువ‌నంత‌పురంలోని పారుతిప‌ల్లి రేంజ్ ఆఫీస్‌లో ర్యాపిడ్ రెస్పార్స్ టీమ్‌లో రోషిణి ఉద్యోగం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles