Hijab controversy: colleges in Udupi declare holiday ఉడుపిలోని మరో కాలేజీకి పాకిన హిజబ్ వివాదం..

Karnataka hijab row massive protests erupt in udupi college ahead of high court hearing

Karnataka college, Mahatma Gandhi Memorial College, Udupi, Karnataka HC, Basavaraj Bommai, Karnataka hijab row, Karnataka hijab ban, Karnataka High Court, Students Split, saffron shawls, religious wise students confrontation, Udupi, Karnataka, Politics

Protests against students wearing hijabs spread to yet another college in Karnataka’s Udupi district, hours ahead of a High Court hearing on the matter. Visuals showed Muslim students wearing hijabs at the Mahatma Gandhi Memorial College shouting slogans of “we want justice” as a large group of male students wearing saffron shawls and headgear confront them. The male students are then seen waving their shawls and shouting slogans.

ITEMVIDEOS: హిజబ్ వివాదం: కర్ణాటక హైకోర్టు విచారణ.. కాషాయ కండువాలతో కాలేజీలకు విద్యార్థులు

Posted: 02/08/2022 12:37 PM IST
Karnataka hijab row massive protests erupt in udupi college ahead of high court hearing

క‌ర్నాట‌క‌లో హిజబ్ (బురఖా) వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చతూనే ఉంది. ముందుగా ఉడిపి, కొలార్ జిల్లాల్లోని పలు కాళాశాలకు మాత్రమే పరిమితిమైన ఈ వివాదాం ఇప్పుడు ఈ రెండు జిల్లాలోని మిగతా కాలేజీలతో పాటు పలు జిల్లాలకు కూడా వ్యాపించాయి. తాజాగా బాగల్‌కోటె జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. హిజబ్ వివాదంలో ఇప్పటిదాకా రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే మతరాజకీయాలు రాజేసిన రాజకీయ పార్టీలు.. అభంశుభం తెలియని విద్యార్థులను రెచ్చగోట్టి తమాషా చూస్తున్నాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

రాష్ట్రంలోని విద్యార్థుల మధ్య ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నప‌రిస్థితులు ప్రస్తుతం ఆందోళ‌న‌క‌రంగా మారుతున్నాయి. బాగల్‌కోటె జిల్లాలో గల రబకవి బనహట్టిలోని ప్రీ-యూనివర్శిటీ కళాశాల వద్ద ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజబ్‌ను ధరించిన పలువురు విద్యార్థినులు కళాశాల ఎదురుగా నిరసనప్రదర్శనలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు.

అదే సమయంలో విద్యార్థినుల నిరసనలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు కాషాయ కండువాల‌తో ఆందోళ‌న చేప‌ట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయిదాటకముందే అదుపు చేశారు. బనహట్టిలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వివాదాన్ని శాంతియుంతంగా పరిష్కరించడానికి జిల్లా పాలన యంత్రాంగం ప్రయత్నిస్తోందని అన్నారు. హిజ‌బ్ వేసుకుని ముస్లిం అమ్మాయిలు కాలేజీల‌కు రావ‌డాన్ని స్థానిక విద్యాసంస్థ‌లు నిషేధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ క‌ర్నాట‌క హైకోర్టు హిజ‌బ్ బ్యాన్ గురించి కేసును విచారించ‌నున్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles