Ratha Saptami celebrations begin in Tirumala తిరుమల, అరసవళ్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Ratha saptami celebrations begins at suryadev temple in arasavalli and tirumala

Ratha Saptami, Ratha Saptami 2022, Arasavalli, Srikakulam, Suryadev Temple, Arasavalli Ratha Saptami celebrations, Minister Dharmana Krishna Das, Devotees, Srikakulam, Ratha Saptami in Tirumala, Tirumala news, Ratha Saptami celebrations, Lord SriVaru on Surya Praba vahanam, andhra pradesh, Devitonal

The Ratha Saptami celebrations began at the Suryadev Temple, a popular shrine in Arasavalli in Srikakulam, Deputy CM Dharmana Krishna Das, Speaker Tammineni Sitaram, District Collector Srikesh B Lathakar and others were present on the occasion. At Tirimala Ratha Saptami celebrations were organised in a grand manner on the occasion of Surya Jayanti. On this occasion, deity appeared on the Surya Prabha Vahanam.

తిరుమల, అరసవళ్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Posted: 02/08/2022 10:54 AM IST
Ratha saptami celebrations begins at suryadev temple in arasavalli and tirumala

సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చాడు. కొవిడ్‌ నిబంధనల మేరకు వాహన సేవలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. సూర్యప్రభ వాహనంతో మొదలైన ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథసప్తమి మహోత్సవంలో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సప్తవాహనాలపై తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు అభయప్రధానం చేయనున్నారు.

రధ సప్తమి పర్వదినం రోజును శ్రీ మలయప్ప స్వామివారు తెల్లవారు జామునే సూర్యప్రభ, ఆ తరువాత చిన్నశేష, ఉదయం 11 గంటలకు గరుడ, మధ్యాహ్నం హనుమ వాహనం అధిరోహించి తిరుమాడ వీధుల్లో సంచరించనున్నారు. అనంతరం చక్రస్నాం ఆచరించిన తరువాత సాయంత్రం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై సంచిరస్తూ భక్తులకు అభయప్రధానం చేయనున్నారు. వాహనసేవల్లో పరిమిత సంఖ్యలోనే తితిదే అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించే అవకాశం ఉంది. ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంతోపాటు తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో ఏడు టన్నుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు.

అరసవల్లిలో ఘనంగా వేడుకలు..

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యదేవుని ఆలయంలో ఇవాళ ఉదయం రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడికి తొలి పూజను ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చేశారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లథాకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనివార్య కారణాల వల్ల విశాఖ శారదా పీఠం శ్రీ స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో ఆలయ అర్చకులు స్వయంగా సేవలను పూర్తి చేశారు.

అభిషేకం అనంతరం విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పయాగం నిర్వహిస్తారు. మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు దర్శనం, రాత్రి 11 గంటల నుంచి ఏకాంత సేవ నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆలయంలో ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఉన్నాయని, డ్రోన్ కెమెరాను వినియోగించనున్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయిస్తామని, ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాదం, దర్శనం టిక్కెట్లను విక్రయిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles