Manikonda Jagir Case: SC Verdict In Favour Of Telangana Govt వక్ఫ్ భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు

Supreme court quashes ap wakf board notification declaring 1654 acres land as wakf property

supreme court, wakf property, wakf board, religious purpose, wakf, STATE OF ANDHRA PRADESH (NOW STATE OF TELANGANA) vs A.P. STATE WAKF BOARD 2022, Justice Hemant Gupta, Justice V. Ramasubramanian, Telangana Infrastructure Development Corporation, Telangana

Land dedicated for pious and religious purpose is not immune from its vesting with the State, the Supreme Court observed while setting aside the action of the Andhra Pradesh Wakf Board that declared land measuring 1654 acres and 32 guntas as wakf property. The bench comprising Justices Hemant Gupta and V. Ramasubramanian held that the said land vest with the state and/or Telangana Infrastructure Development Corporation free from any encumbrance

మణికొండ జాగీర్ భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు

Posted: 02/07/2022 03:39 PM IST
Supreme court quashes ap wakf board notification declaring 1654 acres land as wakf property

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. పదహారు వందల ఏకరాల భూమి విషయంలో చెల్లించాల్సిన పరిహారంలో తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1654 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానివేనని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అత్యంత కీలకమైన ప్రాంతంలో గల వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి. 2016 నుంచి సుప్రీంకోర్టులో జాగీర్ భూముల కేసు కొనసాగుతోంది.

కాగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు లభించాయి. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), వక్ఫ్ బోర్డు మధ్య ఎన్నో ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతోంది. హజరత్‌ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు చెందిన 1654 ఎకరాల 32 గుంటలు తమవేనంటూ వక్ఫ్‌ బోర్డు  కోర్టు కెక్కింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్‌ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పలుమార్లు వాదనలు నడిచాయి. అయితే, 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ భూముల విష‌యంలో గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప‌క్క‌న పెట్టేసింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానివేనంటూ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ ఏకంగా 156 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ప్ర‌భుత్వానికి, వ‌క్ఫ్ బోర్డు మ‌ధ్య నలుగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles