Black Marlin fish claims life of Vizag fisherman విశాఖ తీరంలో కొమ్ము కోనాం చేప.. వేటాడుతున్న మత్య్సకారుడిపై దాడి

Fisherman killed in attack by marlin fish off visakhapatnam coast

fisherman killed in a fish attack, fisherman killed by Marlin fish, fisherman killed by fishr in Bay of Bengal, huge Black Marlin fish attack fisherman, fisherman killed in Bay of Bengal, Fisherman, Marlin fish, Bay of Bengal, joganna, kommu konam, 60 nautical miles, Visakhapatnam, Coastal Security Police, Andhra Pradesh, Crime

A fisherman was killed in an attack by a huge Black Marlin fish in the Bay of Bengal off Visakhapatnam coast. The fisherman was attacked by the giant fish with its spear-like snout when he along with four others was fishing in the deep sea 60 nautical miles from the shore. The incident, said to be the first of its kind in the region

విశాఖ తీరంలో కొమ్ము కోనాం చేప.. వేటాడుతున్న మత్య్సకారుడిపై దాడి

Posted: 02/03/2022 12:54 PM IST
Fisherman killed in attack by marlin fish off visakhapatnam coast

సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారులకు భయానక అనుభవం ఎదురైంది. ఐదుగురు సభ్యులతో చేపటవేటకు వెళ్లిన మత్సకారులు విశాఖతీరంలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి. చేపటలను వేటాడుతున్న ఓ మత్సకారుడిపై ఓ చేప దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. చాపదాడిలో గాయపడిన మత్య్సకారుడిని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఏకంగా ఏడు గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే అప్పటికీ తీవ్ర రక్తస్రావం కావడంతో మత్య్సకారుడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారులోని జాలరిపేటకు చెందిన నొల్లి జోగన్న (45), ఒలిశెట్టి అప్పలరాజు, ఒలిశెట్టి కొర్లయ్య, ఒలిశెట్టి ముత్తురాజు, కాంబాల చినదేముడు, కంబాల మహేశ్ కలిసి ఆదివారం సాయంత్రం ఇంజిన్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. రాత్రంతా వేట కొనసాగించగా, సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో భారీ కొమ్ము కోనం చేప (మార్లిన్ ఫిష్) వారికి కనిపించింది. దీంతో దానికి గేలం వేసేందుకు జోగన్న సముద్రంలోకి దూకాడు. అయితే తనకు ప్రమాదం పోంచివుందని భావించిన కొమ్ముకోనం చేప.. కొంత దూరం వెనక్కి వెళ్లింది. అకస్మాత్తుగా వెనుదిరిగి వేగంగా దూసుకొచ్చి జోగన్నపై దాడికి పాల్పడింది.

దాడి సమయంలో చేప ముందర, ముక్కు భాగంలో ఉండే భారీ కొమ్ము జోగన్న కడుపులో దిగబడింది. తీవ్రంగా గాయపడిన జోగన్నను వెంటనే బోటులోకి చేర్చి తీరానికి బయలుదేరారు. అయితే 90 కిలోమీటర్ల దూరంలో వున్న పడవ ఒడ్డకు చేర్చేందుకు ఎంత వేగంగా నడిపినా దాదాపుగా ఏడు గంటల సమయం పట్టింది. దీంతో తోటి మత్స్యకారులు జోగన్నను ఒడ్డుకు చేర్చారు. కానీ.. అప్పటికీ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న జోగన్న పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కాగా, చేపదాడిలో మత్స్యకారుడు మృతి చెందడం ఇదే తొలిసారని జాలర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles