Janasena responds on employees Chalo vijayawada ‘ఛలో విజయవాడ’పై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందన

Ysrcp government deceives employees and teachers janasena chief

pawan kalyan, janasena, teachers, govt employees, chalo vijayawada, YSRCP Government, pay revision commission, reverse prc, Andhra pradesh, politics

JanaSena chief Pawan Kalyan released a statement on behalf of Chalo Vijayawada. ‘Wages should rise in line with rising prices, but on the contrary, reducing wages is tantamount to deceiving employees. The protest by millions of employees standing in the fire was very distressing. It is unfortunate that hundreds of people have been arrested and caned for sin, demanding that the government keep its word.

ఉద్యోగ, ఉపాధ్యయులను రోడ్లపైకి వచ్చేలా చేసిందీ ప్రభుత్వం: పవన్ కల్యాణ్

Posted: 02/04/2022 10:35 AM IST
Ysrcp government deceives employees and teachers janasena chief

లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వం అమలుపరుస్తున్న కొత్త పీఆర్సీ వేతన విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమ వేతనాల్లో కొతను వ్యతిరేకిస్తూ.. చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోడ్లపైకి రావడం వారి అవేదనలకు అక్రంధనలకు అద్దం పడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమంటూనే.. వారి కడుపులను కోట్టే చర్యలను ప్రభుత్వాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. పీఆర్సీతో జీతం పెంచినట్టు చెబుతోన్న ప్రభుత్వం.. వాస్తవానికి ఉద్యోగులకు గతంలో వస్తున్న వేతనాల్లోంచి 5 వేల నుంచి 8 వేల రూపాయల వరకు తగ్గిస్తోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు.

కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగులు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అందోళన చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తనకున్న సమాచారం మేరకు 200 మందిని అరెస్ట్ చేశారని, లాఠీచార్జి కూడా చేసినట్టు తెలిసిందని అన్నారు. తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే అని, టీఏలు, డీఏలు, పీఆర్సీ పెంపు వంటి అంశాలతో ప్రతి ఉద్యోగి తన కుటుంబం కోసం ప్రణాళిక వేసుకుంటాడని పవన్ కల్యాణ్ వివరించారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారని, ఇప్పుడు దాని ఊసే లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే జీతాలు పెరుగుతాయని చెప్పారని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచలేదని దీనిని ఉద్యోగులు ఎలా స్వీకరిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇక పైపెచ్చు జీతాలు పెంచకపోగా, ఇదివరకు వస్తున్న జీతాలలను పే రివిజన్ సందర్భంగా కుదించడమంటే ఉద్యోగులను నయవంచన చేయడమనే పనన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఇలాంటి పే రివిజన్ కమీషన్ ను దేశంలోని ఏ రాష్ట్ర ఉద్యోగులు, ఇప్పటివరకు కనీవిని ఎరుగరని ఆయన మండిపడ్డారు. 8 శ్లాబుల్లో వచ్చే హెచ్ఆర్ఏని రెండు శ్లాబులకు కుదించడం వల్ల 5 వేల నుంచి 8 వేల వరకు జీతం తగ్గిపోతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని వివరించారు. చర్చల సమయంలోనూ ఉద్యోగుల పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను పిలిపించి వారితో అవమానకర రీతిలో వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. పగవాడు ఇంటికోస్తేనే బోజనం పెట్టే సంస్కృతి తెలుగువారిదని, అలాంటిది ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను అవమానిస్తారా.? అంటూ పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

ఉద్యోగులను అర్ధరాత్రి వరకు వేచిచూసేలా చేయడం, వారి సమస్యలను సరైన రీతిలో పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ ఇంత పెద్దఎత్తున ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆదాయం 3 రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని పవన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై తాను ముందే మాట్లాడదామని అనుకున్నానని, అయితే తమ డిమాండ్ల సాధనలో రాజకీయ పార్టీల సహకారం తీసుకోవడంలేదని ఉద్యోగులు చెప్పడంతో వెనుకంజ వేశానని పవన్ వివరించారు. అయితే ఉద్యోగులు కోరితే కచ్చితంగా మద్దతు ఇవ్వాలని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles