Covid-hit patients must watch their heart: Experts కోవిడ్ బాధితులారా.. మీ గుండె పథిలం

Covid hit patients must watch their heart experts

weakened heart muscle, weakened heart, omicron, Ganesh Manthan, cardiologist, HEAL Foundation, heart-related disease, cardiomyopathy, blood clotting, palpitations, breathlessness, heart problems, heart, dr sagar bhuyar, cardiac problems, acute myocardial injury, cardiovascular system, gastric issues, heart burn, post-covid recovery

Several Covid recovered patients are increasingly complaining of palpitation, with doctors detecting weakened heart muscle among other cardiac problems. Doctors said that even as Omicron variant is milder in nature, recovered patients are at higher risk of heart ailments such as cardiomyopathy, blood clotting, palpitations, breathlessness among others.

కోవిడ్ బాధితులారా.. సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రం.. మీ గుండె పథిలం: వైద్యుల సూచన

Posted: 01/31/2022 04:39 PM IST
Covid hit patients must watch their heart experts

కరోనా మహమ్మారి ప్రజలను అనేక రకాలుగా బలి తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిందన్న అందోళనతోనే కొందరు రోగులు మరణించగా, చికిత్స పోందుతూ బ్లక్ ఆక్సిజన్ లెవల్స్ తగ్గి పరిస్థితి విషమించడంతో మరికోందరు మరణించారు. ఇక అప్పటికీ దీర్ఘకాలిక రోగాలబారిన పడిన వారు కూడా కోవిడ్ చికిత్స పోందుతూ మరణించారు. ఇక తాజాగా వైద్యులు తెలుపుతున్న తాజా విషయాల ప్రకారం మరికోందరు కొవిడ్ బారిన పడి కోలుకున్న తరువాత కూడా హృద్రోగ సమస్యలతో మృతిచెందారు. ఇలాంటి అనేక ఘటనలు మనం తొలి, రెండవ దశలో చూశాం. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తో దేశవ్యాప్తంగా మూడవ దశ ప్రభావం కొనసాగుతోంది. ఈ దశలోనూ కోవిడ్ బారిన పడిన బాధితులు తమ అరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కోవిడ్ బాధితులందరూ తమ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వుండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా గత రెండు వేరియంట్లతో ప్రత్యక్షంగా ప్రభావిత కేసులు నమోదు కాగా, తాజాగా తన ఉద్దృతిని కోనసాగిస్తు్న ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని తేలిగ్గా తీసుకుంటున్న ప్రజలకు.. అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ కారణంగా గుండె పనితీరు ప్రభావితం అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, హృదయ స్పందనల్లో వ్యత్యాసాల సమస్యతో ఎక్కువ మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత తమను ఆశ్రయిస్తున్నారని వైద్యులు తెలిపారు. గుండె కణజాలం బలహీనపడడంతో పాటు, ఇతర సమస్యలను గుర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్ మొదటి (ఆల్ఫా), రెండో (డెల్టా) విడతలో గుండె దెబ్బతినడం, గుండె విఫలమై మరణించిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. ఒమిక్రాన్ లో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నా.. కోలుకున్న వారిలో కార్డియోమయోపతి, రక్తం గడ్డకట్టడం, దడ, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ‘‘మా దగ్గరకు వచ్చే బాధితుల్లో చాలా మంది శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తోందని, గుండె దడ అని చెబుతున్నారు. కరోనా వైరస్ రక్త నాళాల్లో వాపునకు కారణమవుతోంది. దీనివల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడడం జరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక వారు జాగ్రత్తగా ఉండాలి’’ అని హైదరాబాద్ కు చెందిన కార్డియాలజిస్ట్ గణేష్ మంథన్ పేర్కొన్నారు.

‘‘ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్ ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. కోలుకున్న రోగులలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, మూర్ఛ, బలహీనమైన గుండె, గుండె దెబ్బతినడం వంటి నాలుగు ప్రముఖ సమస్యలు గమనించబడ్డాయి, ”అని ఢిల్లీకి చెందిన జిబి పంత్ అసుపత్రిలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్డర్ మోహిత్ గుప్తా చెప్పారు. కొన్ని సందర్భాల్లో, అంతర్లీన గుండె జబ్బులు ఉన్నవారు తీవ్రమైన లక్షణాలను కూడా ఎదుర్కోంటారని వైద్యులు తెలిపారు. అక్యూట్ మయోకార్డియల్ ఇంజ్యూరీకి వైరస్ కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు.

"ప్రజలు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా కోవిడ్ అనంతరం ఎదుర్కొన్నారు, దీని కారణంగా వారు కోలుకున్న తర్వాత గుండె మంటను తరచుగా అనుభవిస్తూ తమను ఆశ్రయించారని.. దీనికి తోడు రక్తపోటు స్థాయిలు తగ్గడం, అధిక మధుమేహ స్థాయిలు కూడా నమోదయ్యాయి”అని ఎల్‌బి నగర్‌లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ భుయార్ అన్నారు. కోలుకున్న వారిలో గుండె సమస్యలతో పాటు ఛాతీలో నొప్పి, తల తిరగడం, బలహీనత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వారు గుర్తించామన్నారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి కఠోర వ్యాయామాలు, కష్టమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నది వైద్యుల సూచన. నిదానంగా ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles