Tremors felt during Ireland-Zimbabwe U-19 WC game ప్రపంచకప్ క్రికెట్ చిత్రీకరిస్తున్న కెమెరాల్లో భూకంప చిత్రాలు

Watch tremors felt during ireland zimbabwe u 19 wc game

shocking occurrence, earthquake, earth tremor, sixth over, first innings, Ireland U19 and Zimbabwe U19, U19 World Cup 2022, semi-final, Queens Park Oval, Trinidad

A heartwarming video of a young girl playing around, and with an elephant is doing the rounds on social media. The three-year-old girl was seen trying to play football with an elephant, and drink milk from the animal in Assam. The elephant was also interacting with the little girl by swinging its trunk at her.

ITEMVIDEOS: ప్రపంచకప్ క్రికెట్ చిత్రీకరిస్తున్న కెమెరాల్లో భూకంప చిత్రాలు

Posted: 01/31/2022 03:42 PM IST
Watch tremors felt during ireland zimbabwe u 19 wc game

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా కామెంటేటర్లకు వింత అనుభవం ఎదురైంది. కేవలం కామెంటేటర్లకు మాత్రమే కాదు స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ వింతఅనుభవం ఎదురైంది. అయితే ఈ విచిత్ర అనుభవాన్ని ఎదుర్కోన్నప్పటికీ మైదానంలోని ఆటగాళ్లుకు మాత్రం దాని అనుభవం ఏమాత్రం తెలియకుండానే పోయింది. ఇంతకీ ఈ వింత అనుభవం ఏంటీ మైదానంలోకి ఆటగాళ్లకు తెలియకుండా స్టేడియంలో వున్న వారు మాత్రమే ఎదుర్కోన్న ఈ ఎక్స్ పీరియన్స్ ఏంటని అంటారా.? ఆ వివరాల్లోకి ఎంటీ ఇస్తే.. ఇది భయానక అనుభవమే. జింబాబ్వే-ఐర్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. మ్యాచ్‌ను షూట్ చేస్తున్న కెమెరాలు ఒక్కసారిగా వణికాయి. కామెంటరీ బాక్స్ కూడా కుదుపులకు గురైంది.

అయితే, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమ కాళ్ల కిందనున్న భూమి కంపించిన విషయం ఆటగాళ్లకు తెలియకపోవడం గమనార్హం. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ కొనసాగింది. జింబాబ్వే ఆరో ఓవర్ నడుస్తున్న సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. 20 సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. పోర్టు ఆఫ్ స్పెయిన్ సముద్ర తీరంలో ఈ భూకంపం సంభవించగా మ్యాచ్ జరుగుతున్న క్వీన్స్ పార్క్ ఓవల్‌లోనూ స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. కెమెరాల్లో రికార్డయినవి అవే. భూకంప సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆండ్రూ మాట్లాడుతూ.. తమ వెనక రైళ్లు పరిగెడుతున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలే వచ్చాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles