Auto driver reunites teen girl with Delhi kin ఆటో డ్రైవర్‌ చెరువతో తల్లిదండ్రుల చెంతకు బాలిక..

Mumbai auto driver reunites delhi teen girl with her parents

vasai, delhi, karwade, vikas takwale, rakesh lohakare, auto rickshaw, auto driver, Raju Karwade, passengers, Vasai Road railway station, Mumbai, Maharashtra, crime

A 14-year-old runaway, who left her home in Delhi after her mother pulled her up for not studying ahead of her Std 10 exams, was reunited with her parents by an alert auto rickshaw driver in Vasai. The driver, Raju Karwade (35), was waiting for passengers on the east side of Vasai Road railway station.

ఆటో డ్రైవర్‌ సమయస్పూర్తి,, తల్లిదండ్రుల చెంతకు చేరిన 14 ఏళ్ల బాలిక..

Posted: 01/31/2022 05:30 PM IST
Mumbai auto driver reunites delhi teen girl with her parents

అటోడ్రైవర్లు అంటే అందరికీ చులకనే. వీళ్లు ఊరు తెలియని వారిని బురడీ కొట్టించి ఊరంతా తిప్పి.. చివరకు ఇరవై రూపాయల దూరానికి వంద రూపాయల మేర లాగేస్తారని భావనతోనే వారిని చులకనగా చూస్తారు. ఇక వారికి మాట్లాడటం కూడా తెలియదని.. భావిస్తారు. అయితే అటోడ్రైవర్ల నిజాయితీకి కొలమానమని పలు ఘటనలు ఇప్పటికే నిరూపించాయి, ఒంటరి బాలిక... ఊరుకాని ఊరుకు వచ్చి.. ఓ ఆటోడ్రైవర్ ను ఆద్దె గదికోసం అరాతీస్తే.. అమ్మో ఇంకేమైనా వుందా.? అంటూ అందోళన వ్యక్తం చేస్తాం. ఇక తాజాగా ఆటో డ్రైవర్లు అంటే ఇంత మంచివారా అనేలాంటి ఘటన ముంబైలోనూ చోటుచేసుకుంది. కానీ ఆటోడ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పారిపోయిన ఓ బాలిక తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకుంది.

 ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పాలఘర్‌లోని వసాయి రైల్వే స్టేషన్‌ వద్ద రాజు కర్వాడే (35) అనే ఆటోడ్రైవర్‌ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా.. క్రితం రోజున ఓ బాలిక (14) ఒంటరిగా ఆ రైల్వేస్టేషన్ నుంచి బయటకు వచ్చింది. రాజు అటోవద్దకు చేరుకోగానే ఎక్కడికైనా వేళ్లేందుకు ఆటో కోసం అడుగుతుందేమోనని అనుకున్నాడు. కానీ బాలిక వచ్చి రాగానే అనుమానం వచ్చే ప్రశ్నను సంధించింది. మంచి గది తక్కువ అద్దెకు దొరుకుతుందేమోనని అడిగింది. దీంతో అనుమానం వచ్చిన రాజు.. బాలికకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. చాలా గదులు ఉన్నాయని, అయితే ఎంతమంది ఉంటారు.? అద్దె ఎలా కడతారు.? అంటూ బాలిక మాటల్లో పెట్టి అనుమానం రాకుండా వివరాలు రాబట్టాడు,

ఆ బాలికది ఢిల్లీ అని, తల్లిదండ్రులతో గొడవపడి ఇంటినుంచి పారిపోయివచ్చినట్లు తెలుసుకున్న ఆటోడ్రైవర్‌ రాజు.. బాలికను నేరుగా స్థానిక మానిక్ పూర్‌ పోలీసుస్టేషన్‌ కు తీసుకెళ్లి అప్పగించాడు. పోలీసులు ఆ బాలిక చెప్పిన వివరాలను బట్టి ఢిల్లీలోని సాకేత్‌ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక తప్పిపోయిన ఫిర్యాదును అందుకున్నట్లు తెలుసుకున్న మానిక్‌పూర్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి వివరాలు అడిగితెలుసుకుని ఈ బాలిక గురించి సమాచారం అందించారు. సాకేత్‌ పోలీసుల నుంచి అందిన వివరాల ద్వారా బాలిక తల్లిదండ్రులకు మానిక్‌పూర్‌ పోలీసులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలికను తీసుకెళ్లారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు చేరవేయటంలో కీలకపాత్ర పోషించిన ఆటోడ్రైవర్‌ రాజు కర్వాడేను పోలీసులు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles