Little Girl plays football with Elephant in Assam చిన్నారి ప్రేమబంధానికి చిక్కుకుపోయిన ఏనుగు..

Assam toddler plays football with elephant tries to milk it

three-year-old girl, Harshita Bora, toddler, heartwarming scenes, playing football, toddler hugging elephant, elephant bina, toddler kissing elephant trunk, forests, human-elephant conflict, Golaghat district, tea gardens, Assam, viral videos, video viral, trending videos

A three-year-old girl was seen trying to drink milk from an elephant in Assam, a set of videos captured the heartwarming scenes. The little girl was seen playing around the animal, hugging and kissing its trunk. The elephant also indulges the child by swinging its trunk at her. In the next frame, the toddler, on her toes, was seen reaching for the elephant's udder trying to drink from it.

ITEMVIDEOS: భారీ ఏనుగు.. చిన్నారి ప్రేమబంధానికి చిక్కుకుపోయింది..

Posted: 01/31/2022 01:26 PM IST
Assam toddler plays football with elephant tries to milk it

అడవిలో పెద్దదైన వన్యమృగం ఏదీ అంటే వెంటనే వచ్చే సమాధానం ఏనుగు. ఔనండీ ఎంత పెద్దదైనా ఈ ఏనుగు మాత్రం శాఖాహారే. అడవిలో అకులు అలుములు తినే ఈ ఏనుగు మాంసాహారం ముట్టుకోదు. అయితే మనుషులతో మాత్రం ప్రేమబంధాన్ని ముడివేసుకునే గజరాజులు మనుషుల కోసం టన్నుల కోద్దీ బరువులను మోసిన ఘటనలు అనేకం. మనుషులు కూడా గజరాజులను వినాయకుడిగానే భావించి ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ పూజలు చేస్తారు. ఇక హిందూ దేవాలయాల్లో ఏదేని ఉత్సవాలు జరిగిన క్రమంలో గజరాజులపై దేవుడి ఉత్సవమూర్తులను పెట్టి ఊరేగిస్తూంటడం అనవాయితీ.

అయితే చిన్నారి ఏనుగుపిల్లలను మనుషులు ఎంత అల్లారి ముద్దుగా చూస్తారో అలానే గజరాజులు కూడా చిన్నారి పిలల్లను ముద్దు చేస్తాయి. వారి ప్రేమబంధానికి లోంగిపోతాయి. వారు ఏం చేసినా చిన్నారి అల్లరిగా స్వీకరిస్తాయి. అలాంటిదే ఈ వీడియో.. అయితే ఇక్కడ తమ ఇంట్లో పెరుగుతున్న ఏనుగుతో మూడేళ్ల చిన్నారి ఏమాత్రం భయం లేకుండా ఎంతో చనువుగా.. కలివిడిగా ఉండటం చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసోంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మూడేళ్ల బోర అనే బాలిక కుటుంబం ఏనుగు సంరక్షణ బాధ్యతల్లో ఉంది. దీంతో ఏనుగుతో అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుకోవడం ఈ చిన్నారికి సాధారణంగా మారిపోయింది.

ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో చిన్నారి కోపంతో ఏనుగు తొండాన్ని కాలుతో తన్నినా, ఆ ఏనుగుకు కోపం రాకపోగా.. బాల్ విసరగానే దానిని పట్టుకుని చిన్నారికి అందించింది. ఏనుగు అంటే అసలే మాత్రం భయం లేకుండా ఆ చిన్నారి మసలుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు, ఆ చిన్నారి ఏనుగు నుంచి పాలు తాగే ప్రయత్నం కూడా చేసింది. తమ పెద్ద వారి సూచన మేరకు చిన్నారి ఏనుగు పాలు తాగాలనుకోగా, ఎత్తు చాలక ఇబ్బంది పడడాన్ని ఇక్కడి వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరిగ్గా అస్సోంలో మనుషులకు-ఏనుగులకు మధ్య ఘర్షన జరుగుతున్న క్రమంలో ఈ వీడియోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles