old woman wins over ap govt in her legal fight ప్రభుత్వంతో న్యాయపోరాటం.. పింఛను సాధించుకున్న ధీర వృద్దనారి

Nellore old woman wins over andhra pradesh government in her legal fight

Nellore old woman legal fight over govt, nellore old woman wins over ap govt, nellore old woman pension, nellore old woman legal battle, nellore woman vs andhra pradesh government, nellore old woman oldage pension, Andhra Pradesh High Court, navooru palli, kakarla sarojanamma, ap, politics

An old woman from Navoorpalli in Nellore district had fought and enjoying her suceess in a legal battel with the andhra pradesh government in obtaining her old age pension. The court had ordered the officials to issue her old age pension with arrears.

ప్రభుత్వంతో న్యాయపోరాటం.. పింఛను సాధించుకున్న ధీర వృద్దనారి

Posted: 01/31/2022 12:31 PM IST
Nellore old woman wins over andhra pradesh government in her legal fight

తనకు వస్తున్న పింఛనును అకారణంగా అపేసిన అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన ఓ వృద్దరాలు.. తనకు రావాల్సిన దానిని ఎలాగైనా సాధించుకోవాలని భీష్మించుకుంది. అందుకు అమె నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతోనే పోరాటానికి దిగింది. దశాబ్దాల క్రితం వరకు ప్రభుత్వాలు తాము అమలుపరుస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలోని లబ్దిదారుల వరకు చేరుతున్నాయా.? అన్న విషయాన్ని కూడా పట్టించుకునేవి కాదు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ప్రచార మాద్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న ప్రజలు ప్రభుత్వాలు అందించే పథకాలను తెలుసుకుంటూ వాటికి అర్హులైనవారు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

ఈ కోవలోనే వృద్దాప్య పింఛన్ల గురించి కూడా సమాచారం అందుకున్న రాష్ట్ర వృద్దులకు ప్రభుత్వం అందించే పింఛన్లు చేరుతున్నాయి. అయితే వివిధ కారణాలు చూపుతూ అధికారులు తన పింఛను ఆపేయడంతో వృద్దురాలికి పాలుపోలేదు. తనకు వచ్చే ఫించనుపైనే అధారపడ్డానని, ఇప్పుడ అది ఒక్కసారిగా అగిపోయిందని.. అమె అధికారుల చుట్టూ తిరిగింది. గ్రామంలోని వాలెంటీర్ల నుంచి మొదలుకుని మండలం, జిల్లా స్థాయి అధికారుల వరకు అమె ప్రదిక్షిణలు చేసింది. అయితేనేం అమె సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఏకంగా అమె న్యాయపోరాటం చేసింది. రాష్ట్ర హైకోర్టు తలుపుతట్టడంతో అమెను విజయం వరించింది.

అమె పింఛనును వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఆమెకు చెల్లించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజనమ్మ (65) 2019 నుంచి పింఛను అందుకుంటున్నారు. జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను రావడం ఆగిపోయింది. దీంతో అధికారులను కలిసి ప్రశ్నిస్తే.. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు. అయితే, తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని అధికారులకు మొర పెట్టుకున్నా వినేవారు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.

దీంతో ఇక లాభం లేదని గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛనును పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే, ఆగిన కాలానికి సంబంధించి మొత్తాన్ని లెక్కకట్టి దానిని కూడా చెల్లించాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించారు. అయితే, ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను నిన్న సరోజనమ్మకు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles