SC rejects plea to do away with quantifiable data collection పదోన్నతులలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Can t lay down new yardstick sc on reservation in promotion to scs sts in govt jobs

Supreme Court, Supreme Court on SC ST reservation, SC ST reservation government jobs, SC ST reservation govt job promotions, Scheduled Tribes, Scheduled Caste

The Supreme Court has refused to dilute conditions for reservations in the promotion of Scheduled Castes (SCs) and Scheduled Tribes (STs) in government jobs, adding that it cannot lay down a new yardstick. A three-judge bench headed by Justice Nageswara Rao said states are obligated to collect data on the inadequacy of representation of SCs/STs.

పదోన్నతులలో ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Posted: 01/28/2022 05:34 PM IST
Can t lay down new yardstick sc on reservation in promotion to scs sts in govt jobs

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు వర్తింపజేస్తున్న రిజర్వేజన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నిబంధనలను నిర్వీర్యం చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో జస్టిస్​ ఎల్​. నాగేశ్వర్​ రావు నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్​లలో రిజర్వేషన్​ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది.

ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం కోసం తామేమీ కొత్త ప్రమాణాలను తీసుకురాలేమని, అది చేయాల్సింది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలని తేల్చి చెప్పింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్ర‌భుత్వాలే లెక్క‌లు సేక‌రించాలని తెలిపింది. మొత్తం స‌ర్వీసు ఆధారంగా కాక‌, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేక‌రించాలని స్పష్టం చేసింది.  అదే విధంగా ప్ర‌మోష‌న్ల డేటా స‌మీక్ష‌కు వ్య‌వ‌ధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.

దామాషా ప్రాతినిధ్యం, త‌గినంత ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం త‌దిత‌ర అంశాల‌న్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను అమలు చేసేముందు కేడర్ వారీగా ఉద్యోగుల ఖాళీల లెక్కలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే విధిగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి దాఖలైన  సుప్రీంకోర్టు విచారణ చేసింది. కాగా, ప్ర‌మోష‌న్ల‌లో రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌లో ప్ర‌మాణాల‌ను నిర్దేశించ‌డంలో ఎదుర‌వుతున్న అయోమ‌యాన్ని దూరం చేయాల‌ని కోరుతూ.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి దాఖలైన 133 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles