new districts only to divert employees issue: TU Leaders ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన పీఆర్సీ సాధన సమితి

Andhra pradesh govt talks with tu leaders to resolve pay revision commission row

state government employees, prc row, prc committee, Bopparaju Venkateswarlu, Sajjala Ramakrishna reddy, pay revision commission, k venkatramireddy, january salaries, govt employees, govt pensioners, Amaravati, Andhra Pradesh, Politics

The state government employees continued their protests against the implementation of Pay Revision Commission (PRC) proposals across the state on Thursday. The employees held bike rallies and dharnas in all districts following an appeal given by the state-level PRC struggle committee comprising key employees' associations. District and mandal committees were constituted to intensify agitation in the coming days.

చర్చించుకుందాం రండీ.. ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన పీఆర్సీ సాధన సమితి

Posted: 01/27/2022 06:09 PM IST
Andhra pradesh govt talks with tu leaders to resolve pay revision commission row

కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ) సాధన సమితికి మరోమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలకు రావాలని కోరింది. నేటి మధ్యాహ్నం 12 గంటకు సచివాలయంలో చర్చించుకుందామంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ పీఆర్సీ నేతలను ఆహ్వానించారు. అయితే, ప్రభుత్వ ఆహ్వానాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు తిరస్కరించారు. మంత్రుల కమిటీ ఎదుట ఇప్పటికే తమ మూడు డిమాండ్లు ఉంచామని, వాటిపై నిర్ణయం తీసుకునే వరకు చర్చలకు రాబోమని ఇది వరకే తేల్చి చెప్పారు.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో తమ జీతాలు, పెన్షన్లకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఆ జీవోలు రద్దు చేయాల్సిందేనని ఏపీ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆపబోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కాగా, ప్రతిరోజు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల కోసం సచివాలయంలో ఉంటున్నా, ఉద్యోగ సంఘాల నేతలు రావడంలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు బదులిచ్చారు.

"డిసెంబరులో ఇచ్చిన జీతాల తరహాలోనే పాత పద్ధతిలో జనవరి నెల వేతనాలు ఇవ్వాలంటూ ఈ నెల 21న పీఆర్సీ సాధన సమితి తరఫున ఏపీ సీఎస్ కు లేఖ ఇచ్చాం. దానిపై ఇవాళ్టివరకు సమాధానం లేదు. మా వాదనలు వినిపించేందుకు ఇదే మంత్రుల కమిటీకి 25వ తేదీన లిఖితపూర్వకంగా డిమాండ్ల చిట్టా అందించాం. మాకు ఏర్పడిన అపోహలు తొలగించేందుకు ఆ కమిటీ వేశామంటున్నారు. ఆ కమిటీకి మేం ఇచ్చిన లేఖకు ఇంతవరకు సమాధానం లేదు. మాకు ఏం కావాలో లేఖలో స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ఎవరికి అర్థం కావడంలేదో మీరే ఆలోచించుకోవాలి. మేం ఇచ్చిన లేఖలకు సమాధానం ఇవ్వకపోగా, ప్రజలకు, ఉద్యోగులకు తప్పుడు సమాచారం పంపిస్తున్నారు.

మేం నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజూ సచివాలయానికి వస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం చర్చలకు రావడంలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉద్యోగ సంఘాల నేతలకు పరిణతి ఉందో లేదో తెలియడంలేదు, వీళ్లు కాకపోతే ఇంకెవరైనా నాయకులు ఉంటే రావొచ్చు... సమస్యలు పరిష్కరిస్తాం అని ప్రచారం చేస్తున్నారు. మీ చుట్టూ మేం తిరిగినప్పుడు ఎక్కడిపోయారండీ సజ్జల గారూ? మేం మీ చుట్టూ తిరగలేదా? ఎన్నిసార్లు వచ్చాం మీ వద్దకు? 11వ పీఆర్సీపై చర్చిద్దామని మీరు అన్నారా లేదా? 40 పాయింట్లపై గంటన్నరపాటు మీరు చర్చించారా? లేదా? ఆర్థికమంత్రి, రాష్ట్ర సీఎస్, ఆర్థిక శాఖ అధికారులే అందుకు సాక్షి. ప్రభుత్వం చేసిన అన్ని ప్రకటనలకు మీరు సాక్షి" అంటూ బొప్పరాజు నిలదీశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles